Share News

AP News: శ్రీకాకుళం జిల్లాలో దారుణమైన ఘటన..

ABN , Publish Date - Dec 06 , 2024 | 11:04 AM

శ్రీకాకుళం: జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఆర్మీ శిక్షణ పేరుతో నిరుద్యోగిని చిత్ర హింసలకు గురి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సంస్థను రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఏర్పాటు చేశాడు. నిరుద్యోగులకు ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని, శిక్షణ ఇస్తానని ప్రకటనలు చేస్తూ నిరుద్యోగులను ఆకర్షిస్తున్నాడు. ఈ నేపథ్యంలో..

AP News: శ్రీకాకుళం జిల్లాలో దారుణమైన ఘటన..

శ్రీకాకుళం: జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఆర్మీ శిక్షణ పేరుతో నిరుద్యోగిని చిత్ర హింసలకు గురి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రిటైర్డ్ ఆర్మీ అధికారిని అంటూ రమణ అనే వ్యక్తి ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సంస్థ పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. అక్కడితో ఆగకుండా శిక్షణ పేరుతో నిరుద్యోగులను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు.


శ్రీకాకుళం జిల్లాలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సంస్థను రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఏర్పాటు చేశాడు. నిరుద్యోగులకు ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని, శిక్షణ ఇస్తానని ప్రకటనలు చేస్తూ నిరుద్యోగులను ఆకర్షిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఈ సంస్థను నిర్వహిస్తున్నాడని ఆరోపణలు గత కొంత కాలంగా వస్తున్నాయి. ఈ సంస్థను రమణ కార్పొరేట్ తరహాలో నిర్వహిస్తున్నాడు. ఇటీవల కాలంలో ఆయనపై చాలా విమర్శలు వచ్చాయి. అయితే ఆయనకు రాజకీయ, అధికారుల వద్ద ఉన్న పలుకబడితో ఆయన ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఇదిలా ఉండగా గురువారం నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఓ వీడియో సర్క్యూలేట్ అవుతోంది. అతని వద్ద శిక్షణ పొందుతున్న నిరుద్యోగులపై అత్యంత అమానవీయంగా వారిని బెల్టుతో కొడుతూ.. కాలితో తన్నుతూ హింసిస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. శిక్షణ పొందుతున్న నిరుద్యోగులపై విచక్షణా రహితంగా కొడుతున్నాడు.


మరోవైపు ఉద్యోగాలు రాలేదని అడిగిన నిరుద్యోగులపై కూడా ఇదే రకంగా దాడులు చేస్తున్నాడు. తాను ఎలంటి తప్పు చేయలేదని బ్రతిమలాడుతూ.. ప్రాధేయపడుతున్నా.. ఆ వ్యక్తిని వదలకుండా కాలితో తన్నుతూ.. బెల్టుతో ఇష్టానుసారంగా కొడుతున్నాడు. గతంలో కూడా చాలా మంది మహిళలు, పురుషులు శిక్షణ పొందారు. ప్రసుత్తం ఈ వీడియో వైరల్ కావడంతో జిల్లా ఎస్పీ దీనిపై దృష్టి పెట్టారు. నిరుద్యోగుల నుంచి సుమారు రూ. లక్ష నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఉద్యోగాలు రానివారు బయటకు వచ్చి ఫిర్యాదు చేయాలన్నా.. తమ ఆవేదన వ్యక్తం చేయాలన్నా.. తమను ఏ విధంగా హింసలకు గురిచేస్తాడోనని భయపడుతున్నట్లు తెలుస్తోంది. అతనికి రాజకీయ, అధికారుల అండదండలు ఉండడంతో జిల్లాలో రమణ ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు..

ప్రభుత్వం తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు..

విశాఖలో డీప్‌ టెక్నాలజీ సదస్సు..

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 06 , 2024 | 12:27 PM