Home » TDP - Janasena
శ్రీకాళహస్తిలో ఈసారి సీన్ రివర్సవుతోంది. ఒకసారి ఓటమి సానుభూతి.. వైసీపీ వేవ్‌లో ఎమ్మెల్యేగా గెలుపొందిన మధుసూదన్‌రెడ్డికి ప్రస్తుతం ఎదురుగాలి వీస్తోంది. విపరీతమైన అవినీతి ఆరోపణలున్నాయి. నిత్య వివాదాస్పద నేతగా ముద్ర వేసుకున్నారు.
నార్పల మండలంలోని వెంకటాంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణను గెలపించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు శనివారం విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పతనం ఆయన సొంత డివిజన నుంచే మొదలైందని, సొంత పార్టీ వారే ఆయన్ను ఓడించబోతున్నారని కూటమి అనం తపురం అర్బన ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు.
‘అధికారంలోకి వస్తే పిల్ల కాలువల ద్వారా లక్ష ఎకరాలకు సాగు నీరు ఇస్తానని హామీ ఇచ్చావ్ గుర్తుందా ప్రకాష్‌రెడ్డి... ఐదేళ్లు అయింది... ఒక్క సెంటుకు కూడా నీరు ఇవ్వలేదు.. కనీసం ఒక్క చెరువుకు కూడా నీరివ్వలేదు... ఇక నీ మాటలను ప్రజలు నమ్మె స్థితిలో లేరు.. ’ అని మాజీ మంత్రి పరిటాల సునీత ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. తరచూ జ్వరం బారిన పడుతున్నారు. ఏం జరిగిందని వైద్య పరీక్షలు జరిపించారు. పవన్ కల్యాణ్‌కు రికరెంట్ ఇన్సుయం వల్ల ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరిందని జనసేన పార్టీ శనివారం నాడు ప్రకటనలో పేర్కొంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ జిల్లాకు వస్తున్నారు. ఐదు రోజుల కిందట విజయనగరం, నెల్లిమర్ల రావాల్సి ఉండగా పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఈ నెల 23న పర్యటన ఖరారైంది. ఇదిలా ఉండగా అంతకుముందు ఈ నెల 21న చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా శృంగవరపుకోట వస్తున్నారు
ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టాలంటే 88 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. దీంతో మేజిక్ ఫిగర్ దాటేందుకు అన్ని పార్టీలు శ్రమిస్తున్నాయి. ఎన్నికల వ్యూహాలను రచిస్తూ ముందుకెళ్తున్నాయి. పవర్లోకి రావాలనుకునే ఏ పార్టీకైనా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని సీట్లు కీలకం కానున్నాయి. ఈ రెండు ఉమ్మడి జిల్లాలు కలిపి 34 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 34 సీట్లలో మోజార్టీ స్థానాలు గెలిస్తే అధికారానికి దగ్గరవ్వొచ్చు.
విజయవాడ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవణ్ కల్యాణ్ బుధవారం కృష్ణా జిల్లాలో ఉమ్మడి ప్రచారం చేయనున్నారు.
జగన్ భస్మాసురుడిలా వ్యవహరిస్తున్నాడని, మే 13న భస్మాసుర వధ జరగాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన గాజువాక ప్రజాగళం సభలో ప్రసంగించారు. అవి ఆయన మాటల్లోనే..
ఏపీ సార్వత్రిక ఎన్నిక ( AP Election 2024)ల్లో తెలుగుదేశం - జనసేన - బీజేపీ పొత్తులు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తుడంటంతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గెలుపు వ్యూహాలపై పదును పెట్టారు. ఇందులో భాగంగానే బాపట్ల పార్లమెంట్‌లోని అసెంబ్లీ అభ్యర్థులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సమావేశానికి కూటమి నేతలు కూడా హాజరయ్యారు.