Home » Telugu Desam Party
పింక్ డైమండ్ అంటూ వైసీపీ నేత విజయసాయిరెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. విజయసాయిరెడ్డి ట్వీట్లు చూస్తుంటే కడుపు మండిపోదా అని అన్నారు. సీఎం చంద్రబాబుని విజయసాయిరెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చోలేమని వార్నింగ్ ఇచ్చారు.
పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ ఆరోపణలు చేశారు. జగన్ ఐదేళ్లలో ఒక్కసారైనా సతీసమేతంగా తిరుమలకు వెళ్లారా? అని ప్రశ్నించారు. జగన్ భ్రష్టు పట్టించిన వ్యవస్థలను బాగు చేసే పనిలో చంద్రబాబు ఉన్నారని తెలిపారు.
జగన్ పాలనలో టీటీడీలో చాలా అవినీతికి పాల్పడి అందినంత దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. వెంకటేశ్వర స్వామివారి పట్ల జగన్ చేసిన నికృష్ట కార్యానికి హైందవ భక్తులందరూ భగ్గుమంటున్నారని చెప్పారు.
గ్రామీణ రోడ్లుపై కేంద్రానికి మంత్రి బీసీ జనార్దనరెడ్డి ప్రతిపాదనలు అందించినట్లు మండల టీడీపీ అధ్యక్షుడు మూలే రామేశ్వరరెడ్డి, నంద్యాల రామేశ్వరరెడ్డి, వీఅర్ లక్ష్మీరెడ్డి గురువారం వెల్లడించారు.
బాలీవుడ్ నటి జత్వానీ కేసులో భయంతోనే.. నీలి మీడియా తప్పుడు రాతలు రాస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపణలు చేశారు. నీలి మీడియాలో మహిళలను కించపరుస్తూ తప్పుగా రాయటాన్ని తీవ్రంగా ఖండించారు. జత్వాని కేసుకు దేశవ్యాప్త మద్దతు లభిస్తుందని అన్నారు.
విజయవాడలో పరిస్థితి మెరుగుపడిందని మంత్రి నారాయణ తెలిపారు. ఫైరింజన్లతో ఇళ్లను శుభ్రం చేయిస్తున్నామని అన్నారు. మళ్లీ వరద అంటూ తప్పుడు ప్రచారం చేయడాన్ని వైసీపీ కుట్రగా భావిస్తున్నామని అన్నారు. ఈవిషయంపై ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశామని మంత్రి నారాయణ అన్నారు.
వైసీపీ పాలనలో రోడ్లు నిర్వీర్యమయ్యయని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విమర్శలు చేశారు. దగదర్తి-బుచ్చిరెడ్డిపాలెం రోడ్డును పున ప్రారంభించారు. తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో ఈరోజు భారీ బైక్ ర్యాలీ తీశారు.
తుని రూరల్, సెప్టెంబరు 14: ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ఆక్రమ కట్టడాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అధి
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కృషి చేస్తామని.. అలా చేయకపోతే తమ పదవులకు రాజీనామా చేస్తామని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు. ప్లాంట్ పరిరక్షణ చేయకపోతే తాను పదవులకు రాజీనామా చేసి స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్షలో కూర్చుంటానని పల్లా శ్రీనివాసరావు అన్నారు.
కూటమి ప్రభుత్వం మీద బోట్లతో వైసీపీ నేతలు పన్నిన కుట్రను దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీరియస్‌గా విచారించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ప్రకాశం బ్యారేజ్‌ను ఇసుక పడవలు ఢీ కొట్టడం.. వైసీపీ నేతలు జగన్ మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్, తలశీల రఘురాంల కుట్రేనని ఆరోపణలు చేశారు.