Home » TG News
ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని పలు చెరువుల ఆక్రమణలు, వరద నీటి కాలువల మళ్లింపుపై రెవెన్యూ, నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలతో కలిసి క్షేత్రస్థాయిలో సర్వే చేయాలని అధికారులను ఏవీ రంగనాథ్ ఆదేశించారు.
ఒక గది విస్తీర్ణమంత చెస్ బోర్డు.. దానిపై మోహరించిన పావులు! ఇక ఎత్తుకు పై ఎత్తు వేయడమే తరువాయి అనుకుంటే పొరపాటే! ఎందుకంటే ఇది చదరంగం బోర్డులా కనిపించే భారీ చాక్లెట్!
ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి కుమారుడు కార్తీక్ వివాహం అర్షితో సోమవారం రాత్రి ఘనంగా జరిగింది.
పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ఠ నీటిమట్టం (ఎఫ్ఆర్ఎల్) దాకా నీటిని నిల్వ చేస్తే.. తెలంగాణ భూభాగంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించడానికి (డీమార్కేషన్కు)గాను సర్వే చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముందుకొచ్చింది.
పాఠశాల విద్యలో ‘నో డిటెన్షన్’ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలంగాణలో ఇప్పుడే అమల్లోకి వచ్చే అవకాశం లేదు. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలో అమలు పరచకూడదని ప్రాథమికంగా ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
భూభారతి చట్టం- 2024తో రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కారమవుతాయని ఈ చట్టం రూపకర్తలు సునీల్, లచ్చిరెడ్డి తెలిపారు.
గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆమేరకు కార్యాచరణ ప్రారంభించింది.
ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. గతంలో ఇళ్ల పథకంలో జరిగిన అవకతవకలను పరిగణనలోకి తీసుకుని.. ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటోంది.
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలోని ఇళ్లు, భూములను వేలం వేసేందుకు రంగం సిద్ధమైంది. వేలం వేసేందుకు గృహ నిర్మాణ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.
ఎలక్ర్టిక్ వాహనాల తయారీ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణాలో అత్యంత అనుకూలమైన వాతావరణం నెలకొల్పామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.