Home » Twitter
మార్చి 15న ఎలాన్ మస్క్ ట్విట్టర్ సీఈఓగా(Twitter CEO Elon Musk) బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక సంచలానత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించడం, బ్లూటిక్కు డబ్బులు వెచ్చించాల్సి రావడం, ట్వీట్లు చూసే విషయంలో, ట్వీట్లు పెట్టే విషయంలో పరిమితులు, ట్విట్టర్ వినియోగించాలంటే కచ్చితంగా లాగిన్ కావాలనే నిబంధనలు ఇలా అనేక కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఇవి చాలవన్నట్టుగా ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ లోగేనే మార్చేశారు.
మనుషుల లాగానే వివిధ జంతువులు కూడా అద్భుతంగా అనుకరిస్తాయి. ముఖ్యంగా కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులు తమ యజమానులను బాగా అనుకరిస్తాయి. ఎవరైనా శ్రద్ధగా ఏదైనా విషయం నేర్పితే చాలా త్వరగా నేర్చుకుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల ఓ యువకుడు షేర్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఆ ఫొటోపై నెటిజన్లు తమదైన వాదనలను వినిపిస్తున్నారు. @iffiViews అనే ట్విటర్ హ్యాండిల్లో ఓ యువకుడు తన హాస్టల్ రూమ్‌కు సంబంధించిన ఫొటోను షేర్ చేశాడు.
ప్రపంచవ్యాప్తంగా ట్విటర్ లోగో మారిపోయింది. ఎక్స్ హోల్డింగ్స్ కార్పొరేషన్ పేరిట గత మార్చిలో అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో మస్క్ ఓ కొత్త కంపెనీని స్థాపించారు. ‘ఎక్స్’ అనే దాన్ని కొన్నాళ్లుగా ఆయన ‘ఎవ్రిథింగ్ యాప్’గా వ్యవహరిస్తున్నారు. ట్విటర్ ప్లాట్‌ఫామ్ రంగు కూడా నీలం నుంచి నలుపునకు మారిపోయింది.
ఆ వ్యక్తి తన కొడుకును తీసుకువచ్చేందుకు కారులో వెళ్లాడు.. కొడుకును తీసుకుని బయటకు వచ్చాడు.. ఇంతలో ఆ బాలుడు తండ్రి చేతిలోని కారు తాళం తీసుకున్నాడు.. కారు ఎక్కేసి లాక్ చేసుకున్నాడు.. తలుపు తీయడానికి ప్రయత్నించినా అది రాలేదు.. ఏం చేయాలో అతడికి అర్థం కాలేదు..
'ఏమీ కాదులే అనే ఓ చిన్నపాటి నిర్లక్ష్యం ఆ మహిళను మాత్రమే కాకుండా పాపం పసిబిడ్డను కూడా ప్రమాదంలోకి నెట్టేసింది.
ఎంత ఈత వచ్చినవాడైనా కాళ్లూ చేతులూ ఆడించకపోతే నీళ్ళ్ళలో మునుగుతాడు.. కానీ ఇతను మాత్రం తాపీగా మంచం మీద నిద్రపోయినట్టు నీళ్ళ మీద పడుకున్నాడు.
హెల్మెంట్ ధరించకపోవడంతో ఓ వ్యక్తి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఆపి తాళాలు లాగేసుకున్నారు పోలీసులు. కానీ ఆ తరువాత అతను పోలీసులకు ఊహించని షాకిచ్చాడు.
చాక్లెట్లు దొంగతనం చేసిన ఓ వ్యక్తికి బ్రిటన్ కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించింది. అదేంటి.. చాక్లెట్లు దొంగిలించినందుకు అంత శిక్ష పడిందా అని ఆశ్చర్యపోతున్నారా? అతను దొంగిలించిన చాక్లెట్లు ఒకటి, రెండు కాదు.. ఏకంగా 2 లక్షల చాక్లెట్లను దొంగిలించాడు. ఆ చాక్లెట్ల ఖరీదు అక్షరాలా రూ.42 లక్షలు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకు ఆసక్తికరంగా అనిపించిన వాటిని, నవ్వు తెప్పించిన వాటిని ట్విటర్లో పోస్ట్ చేసి అందరితో పంచుకుంటుంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఆసక్తికర వీడియో చాలా మందిని ఆకట్టుకుంది.