Viral Video: ఇతడికేమైనా అద్భుత శక్తులున్నాయా ఏంటీ..? నీళ్లపై ఇలా పడుకున్నా అస్సలు మునగడం లేదేంటి..?
ABN , First Publish Date - 2023-07-24T13:34:50+05:30 IST
ఎంత ఈత వచ్చినవాడైనా కాళ్లూ చేతులూ ఆడించకపోతే నీళ్ళ్ళలో మునుగుతాడు.. కానీ ఇతను మాత్రం తాపీగా మంచం మీద నిద్రపోయినట్టు నీళ్ళ మీద పడుకున్నాడు.
నీటి మీద నడవడం అనే మాటను చాలామంది వినే ఉంటారు. కొందరు దీన్ని ఫేక్ అని కొట్టిపడేస్తే మరికొందరు అది మ్యాజిక్ అని అంటారు. నీటి మీద నడవడం సంగతేమో కానీ నీటి మీద నిద్రపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి నీళ్ళలో దిగి కనీసం కొంచెం కూడా మునగకుండా హాయిగా మంచం మీద పడుకున్నట్టు పడుకున్నాడు. అలాగని అతను ఇందులో ఎలాంటి మోసం చేయలేదు. నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
నీళ్లలో ఈత కొట్టడం, మునకలేయడం చాలా మందికి ఇష్టం. ఎంత ఇష్టమున్నా సరే మనిషన్నాక నీళ్లలో మునుగుతాడు. యోగాలో కొందరు నీటిమీద తేలుతూ యోగా చేయడం కూడా చూసి ఉంటారు. కానీ యోగాలో కూడా మనిషి ఎంతో కొంత మునుగుతాడు. అయితే ఓ వ్యక్తి నీళ్ళ మీద తేలుతున్నాడు(man floating on water). సరికదా అతని శరీరం నీళ్ళను తాకుతోందా లేదా అని సందేహం వస్తుంది. వీడియోలో ఓ వ్యక్తి పెద్ద నీటి గుంటలో దిగడం చూడవచ్చు. చుట్టూ ఎత్తైన ఎర్రమట్టి దిబ్బలున్న ప్రాంతంలో లోతుగా, చిన్నగా ఉన్న నీటి గుంట కనిపిస్తుంది. ఈ నీరు సముద్రపు నీరులా నీలంగా ఉంది. నీటి స్వచ్చత కారణంగా నీటి గుంట లోతు కూడా కనిపిస్తోంది. ఇది ఈజిప్ట్(Egypt) లోని సివా అనే పేరు కలిగిన ఒయాసిస్(siwa ooasis) అని చెబుతున్నారు. ఒక వ్యక్తి ఈ నీటి గుంటలోకి కాళ్ళు పెడుతూ మెల్లిగా దాంట్లోకి దిగుతాడు. అయితే కాళ్లు ఉంచిన తరువాత అతను నీళ్ళలోకి కనీసం నడుములోతు వరకు కూడా మునగలేదు. అతను హాయిగా మంచం మీద పడుకున్నట్టు నీటిమీద పడుకున్నాడు(man sleeping on the top of water). ఇదైమైనా మ్యాజిక్కా అంటే కాదట. అలాగని ఇందులో ఎలాంటి మోసం లేదు. ఈ నీరు 95శాతం ఉప్పు సాంద్రత కలిగినదట(95% salt concentration on water). ఈ కారణంగా ఈ నీటిలో ఎవరూ మునిగిపోరని చెబుతున్నారు. ఈ కారణంగా ఈ వ్యక్తి నీళ్ళలో హాయిగా పడుకున్నాడని అంటున్నారు.
Viral Video: బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఆపేసి.. వెంటనే తాళం లాగేసుకున్న పోలీసులు.. అతడు ఇచ్చిన ట్విస్టుతో అంతా షాక్..!
ఈ వీడియోను Fascinating అనే ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'నీటిలో 95శాతం ఉప్పు సాంద్రత ఉన్న కారణంగా మనుషులు మునిగిపోరు' అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మొదట ఆశ్చర్యపోయినా, దీని వెనుక కారణం తెలిశాక తమ అభిప్రాయాలను కామెంట్స్ చేస్తున్నారు. 'బాగా లావుగా ఉన్నవాళ్ళు కూడా ఈ నీళ్ళలో తేలచ్చా' అంటూ ఒకరు అమాయకంగా కామెంట్ చేశారు. 'ఈ నీటి గుంట ఎంత లోతు ఉందో ఏంటో అర్థం కాకుండా నన్ను భయపెడుతోంది' అని మరొకరు కామెంట్ చేశారు. 'నాలాంటి వాడు ఆ నీటి గుంటలోకి వెళితే అందులో 20శాతం ఉప్పు సాంద్రత తగ్గిపోతుంది' అని మరొకరు చమత్కారం చేశారు.