Share News

YS Jagan: వేడుకలకు వైఎస్ జగన్ డుమ్మా..

ABN , Publish Date - Mar 30 , 2025 | 09:42 PM

YS Jagan: తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరుకాలేదు. దీంతో ఈ వేడుకలను పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు దగ్గరుండి జరిపించారు. ఈ వేడుకలకు వైఎస్ జగన్ హాజరు కాకపోవడంపై ఆ పార్టీలో నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

YS Jagan: వేడుకలకు వైఎస్ జగన్ డుమ్మా..
YS Jagan

అమరావతి, మార్చి 30: ఉగాది వేడుకలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ డుమ్మా కొట్టారు. ఉగాది పర్వదినం సందర్భంగా తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఉగాది సంబరాలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరు కాలేదు. పార్టీ కార్యాలయ ఇంఛార్జ్ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబులతో ఉగాది ఉత్సవాలను నిర్వహించారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ జగన్ హాజరు కాకపోవడంపై పార్టీలో నిరసన వ్యక్తమవుతోంది.

గతంలో అధికారంలో ఉన్నప్పుడు సతీ సమేతంగా ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్నారని వారు గుర్తు చేసుకొంటున్నారు. అప్పుట్లో ఆయన చిరునవ్వులు సైతం చిందించారని వారు పేర్కొంటున్నారు. ఈ సారి మాత్రం ఉగాది ఊసే ఎత్తకుండా ఉత్సవాలు పార్టీ నేతలు, కార్యాలయ సిబ్బందితో నిర్వహించారంటూ వారు పేర్కొంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్లకుండా ఉన్న వైఎస్ జగన్.. కనీసం తెలుగు వారి సెంటిమెంట్ పండగ.. ఉగాదికి వేడుకలకు అయినా ఆయన హాజరైతే బావుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


అదీకాక.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కేవలం 11 సీట్లు పార్టీకి వచ్చాయని.. దీంతో ప్రతిపక్ష హోదా ఇస్తేనే కానీ అసెంబ్లీకి రానంటూ ఆయన భీష్మించుకుని కూర్చున్నారని పేర్కొంటున్నారు. ఈ అంశంపై ఆయన హైకోర్టుకు సైతం వెళ్లారని వారు గుర్తు చేసుకుంటున్నారు. ఆయనతోపాటు వైసీపీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీకి డుమ్మా కొట్టారని గుర్తు చేస్తున్నారు.


2024 మే, జూన్ మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ఆంధ్రప్రదేశ్ ఓటర్ పట్టం కట్టాడు. ఇక వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో తనకు ప్రతిపక్ష హోదా కేటాయించాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడి లేఖ రాశారు. సభలో సంఖ్య బలం లేకుంటే ఆ హోదా కేటాయించడం కుదరదని వైఎస్ జగన్‌కు స్పీకర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష హోదా కేటాయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పీటిషన్‌లో ఆయన కోరారు.

ఈ వార్తలు కూడా చదవండి:

NRI: డాలాస్‌లో టీపాడ్ బ్లడ్ డ్రైవ్.. వెల్లువెత్తిన స్పందన

AFSPA: మణిపూర్‌పై కేంద్రం కీలక నిర్ణయం

Maoists: దెబ్బ మీద దెబ్బ.. మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ

T Jayaprakash Reddy: నా మీద ఎన్నో కుట్రలు జరిగాయి

40 ఏళ్లుగా మసిలే జలధారలు!

టెన్త్‌ జవాబు పత్రాల తరలింపులో నిర్లక్ష్యం

జములమ్మకు గద్వాల సంస్థానాధీశుల వారసుడి పూజలు

కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..

CM Revanth Reddy: శ్రీమంతులే కాదు.. పేదలు తినాలి

NRI: తానా 24వ సదస్సుకు ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఎండికి ఆహ్వానం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 30 , 2025 | 09:42 PM