Home » Uttarakhand Rescue Operation
ఉత్తరఖండ్ రాష్ట్రం ఉత్తర కాశీలోని సొరంగంలో 17 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులు ఎట్టకేలకు బయటకి రావడంపై ప్రధాని మోదీ(PM Modi) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులను ఆయన ఫోన్లో పరామర్శించారు.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కార్మికుల్ని బయటకు తీసేందుకు యుద్ధప్రాతిపదికన నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు 17వ రోజు విజయవంతమైంది. రెస్క్యూ అధికారులు సురక్షితంగా ఆ కార్మికులందరినీ..
ఒకటి కాదు, రెండో కాదు.. ఏకంగా 17 రోజుల సుదీర్ఘ ఎదురుచూపులకు శుభంకార్డు పడింది. మొక్కవోని సంకల్పంతో నిర్వీరామంగా కొనసాగించిన కృషి ఫలించింది. ఇన్నిరోజుల పాటు టన్నెల్‌లోనే చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా ప్రాణాలతో బయపడ్డారు.
పదిహేడు రోజుల నిరీక్షణకు మరి కొద్ది గంటల్లోనే తెరపడనుంది. ఉత్తరాఖండ్ లోని ఉత్తర్‌కాశి సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది ఏ క్షణంలోనే బయట పడే అవకాశాలున్నాయి. రెస్క్యూ బృందం చేపట్టిన మాన్యువల్ డ్రిల్లింగ్ పనులు మంగళవారం మధ్యాహ్నం పూర్తయ్యాయి.
ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు చేస్తున్న పనులు కీలక దశకు చేరుకున్నాయి. 24 మందితో కూడిన రాట్ హోల్ మైనింగ్ నిపుణుల బృందం మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రక్రియను చేపడుతున్నారు.
ఉత్తరాఖండ్ సొరంగంలో గత 16 రోజులుగా చిక్కుకుపోయిన 41 మంది కూలీలను రక్షించేందుకు కొండ పైనుంచి నిలుపుగా చేపట్టిన డ్రిల్లింగ్ పనులు చురుకుగా సాగుతున్నాయి. నవంబర్ 30 కల్లా వర్టికల్ డ్రిల్లింగ్ పనులు పూర్తవుతాయని అంచనా వేస్తున్నట్టు నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ అహ్మద్ సోమవారంనాడు తెలిపారు.
ఉత్తరాఖండ్ లోని ఉత్తర్‌కాశిలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో కొంతభాగం కుప్పకూలి 41 మంది కార్మికులు గత 16 రోజులుగా చిక్కుకుపోయిన ఘటనలో తమ ప్రమేయాన్ని అదానీ గ్రూప్ సోమవారంనాడు తోసిపుచ్చింది. ఉత్తరాఖండ్ సొరంగం నిర్మాణంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని వివరణ ఇచ్చింది.
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యలకు అవాంతరాలు తప్పడం లేదు. అమెరికా నుంచి తెప్పించిన ఆగర్ మిషన్‌కు ఇనుపపట్టీ అడ్డుపడటం, మిషన్ బ్లేడ్లు దెబ్బతినడంతో హైదరాబాద్ నుంచి కట్టర్‌ను రప్పిస్తున్నారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో చిక్కుకుపోయిన కూలీలు ఇంకా లోపలే ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో శుక్రవారం అతిపెద్ద అవరోధం ఎదురైంది.