Home » Vijayawada Floods
ముంపులో మునిగి, బురద పేరుకుపోయి కష్టాల కడలిలా మారిన వరద బాధిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా సర్కారు ముమ్మర చర్యలు తీసుకుంటోంది. సహాయ చర్యల్లో వేగం పుంజుకొంది.
Andhrapradesh: బుడమేరులో గండ్లు పడిన ప్రాంతాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా హోంమంత్రి ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... గత ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగానే విజయవాడ ముంపుకు గురయిందని విమర్శించారు.
Andhrapradesh: విజయవాడలో వరద ముంపునకు గురైన బాధితులకు రేపటి (సెప్టెంబర్ 6) నుంచే నిత్యావసరాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని 179 వార్డు, మూడు గ్రామ సచివాలయం పరిధిలో వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నారు.
Andhrapradesh: వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు.
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుడమేరు పాపం గత ప్రభుత్వానిదే అంటూ విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘బుడమేరు గేట్లు ఎత్తేశారా..?’’ అని జగన్ అంటున్నారని... సీఎంగా.. ఎమ్మెల్యే, ఎంపీగా పని చేసిన జగన్ ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
Breaking News Live Updates: ప్రపంచ నలుమూల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వరదల పరిస్థితి ఎలా ఉంది..? మినిట్ టు మినిట్ తాజా వార్తలను ఇక సులభంగా తెలుసుకోవచ్చు. మీకోసమే ప్రత్యేకంగా ఈ లైవ్ అప్‌డేట్స్ ప్లాట్‌ఫామ్.. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
విజయవాడ పరిసరాల్ని అతలాకుతలం చేసిన భారీ వర్షాలు, వరదలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి.
Andhrapradesh: భారీ వర్షాల కారణంగా మైలవరం ఎర్ర చెరువుకు గండి పడింది. గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి చెరువు నిండిపోయింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు కలింగం వద్ద చెరువుకు గండి పెట్టి నీరును దిగువకు వదిలి అనంతరం చెరువుకు పడిన గండిని నేతలు పూడుస్తున్నారు. ఎర్ర చెరువు నీటిని దిగువకు విడుదల చేయడంతో జి.కొండూరు మండలం గుర్రాజుపాలెం గ్రామానికి వరద ముప్పు పొంచివుంది.
Andhrapradesh: ఏపీని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత మూడు రోజులుగా అనేక ప్రాంతాలు వరద ముంపులోనే ఉండిపోయాయి. గ్రామాలకు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీలో కేంద్ర బృందం పర్యటించాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర బృందం సభ్యులు రాష్ట్రానికి చేరుకున్నారు.
బుడమేరు (Budameru) వరద నుంచి నగరం క్రమంగా కోలుకుంటోంది. బాధితులు బుధవారం వెల్లువలా ముంపు ప్రాంతం నుంచి బయటకు తరలివస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో సింగ్‌నగర్ నుంచి దూరప్రాంతాలైన కండ్రిక, ఆంధ్రప్రభ కాలనీ, రాజీవ్‌నగర్..