-
-
Home » Prathyekam » Breaking News Of 5th September 2024 Today Latest Telugu News Live Updates
-
Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Sep 05 , 2024 | 08:33 AM
Breaking News Live Updates: ప్రపంచ నలుమూల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వరదల పరిస్థితి ఎలా ఉంది..? మినిట్ టు మినిట్ తాజా వార్తలను ఇక సులభంగా తెలుసుకోవచ్చు. మీకోసమే ప్రత్యేకంగా ఈ లైవ్ అప్‌డేట్స్ ప్లాట్‌ఫామ్.. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
2024-09-05T14:05:26+05:30
ఎమ్మెల్యే ఆది మూలం టీడీపీ నుంచి సస్పెన్షన్
-
2024-09-05T13:30:06+05:30
బీఆర్ఎస్ ఎంపీ పెద్ద మనసు!
ఖమ్మం వరద బాధితులకు వెల్లువలా విరాళాలు
కోటి విరాళం ఇచ్చిన బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ బండి పార్థసారథి రెడ్డి
కోటి రూపాయల చెక్కును కలెక్టర్‌కు అందజేసిన..
హెటిరో డ్రగ్స్ అధినేత, ఎంపీ బండి పార్థసారథి రెడ్డి
కోటి రూపాయలతో పాటు లక్షలాది విలువచేసే మందులు వితరణ..
వారం రోజులు పాటు ఖమ్మంలోనే సేవలు అందించనున్న సింధు హాస్పిటల్ డాక్టర్లు
-
2024-09-05T13:20:49+05:30
ఇటు ఎర్రచెరువు.. అటు బుడమేరు టెన్షన్.. టెన్షన్!
బెజవాడకు పొంచి ఉన్న మరో ముప్పు..?
ఆందోళనలో విజయవాడ వాసులు
ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎర్ర చెరువుకు గండి
గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి నిండిన చెరువు
కలింగం వద్ద చెరువుకు గండి పెట్టి నీరును దిగువకు వదిలి..
చెరువు పడిన గండిని పూడుస్తున్న టీడీపీ నాయకులు
ఎర్ర చెరువు నీరుతో జి.కొండూరు మండలం..
గుర్రాజుపాలెం గ్రామానికి పొంచి ఉన్న వరద ముప్పు
గుర్రాజుపాలెం కొత్తూరులోని ప్రజలు ఇళ్ళు ఖాళీ చేయాలని పోలీసుల మైక్ ప్రచారం
ఉదృతంగా ప్రవహిస్తున్న కొత్తూరు వాగు
ఎర్ర, పంగిడి చెరువులను పరిశీలిస్తున్న ఇరిగేషన్, పోలీస్ అధికారులు
ఏమవుతుందో.. ఏమో..!
బుడమేరులో కొనసాగుతున్న వరద ఉధృతి
నందివాడ మండలంలో జలమయమైన బుడమేరు పరివాహక గ్రామాలు
ఇళ్లలోకి భారీగా చేరిన వర్షపు నీరు
స్పీడ్ బోట్ల సహాయంతో ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
బుడమేరు వరద నీటిలో పూర్తిగా మునిగిపోయిన పంట పొలాలు, చేపల చెరువులు
రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ఎస్డిఆర్ఎఫ్ బృందాలు
-
2024-09-05T13:00:07+05:30
టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారంపై హైకమాండ్ సీరియస్
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ హైకమాండ్ సీరియస్
ఏబీఎన్‌లో ప్రసారమవుతున్న వీడియోల విషయం..
ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళిన అధికారులు
దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశాలు
తీవ్ర చర్యలు తీసుకోవాలని భావిస్తున్న టీడీపీ అధిష్టానం
వరద సహాయక చర్యల్లో బిజీగా ఉన్న సీఎం
మొత్తం అంశాన్ని సీఎంకు నివేదించిన అధికారులు
ఇవాళ సాయంత్రం లోపు కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్
-
2024-09-05T12:40:48+05:30
విజయవాడలో కేంద్ర బృందం పర్యటన
వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్న..
కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్‌కుమార్ జిందాల్ టీమ్
భారీ వర్షాలు, వరదలతో ఏపీలో నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర బృందం
నేరుగా నష్టాన్ని పరిశీలించడంతో పాటు వరద బాధితులతో..
మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకోనున్న కేంద్ర బృందం
ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఆఫీస్‌లో అధికారులతో కేంద్ర బృందం సమీక్ష
భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాన్ని..
కేంద్ర బృందానికి వివరించనున్న అధికారులు
-
2024-09-05T12:36:06+05:30
articleText
-
2024-09-05T12:30:51+05:30
టీడీపీ ఎమ్మెల్యే వీడియోలు బయటపెట్టిన మహిళ!
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై మహిళ సంచలన ఆరోపణలు
ఒకే పార్టీకి చెందిన వాళ్ళం కావడంతో పలు కార్యక్రమాల్లో ఆదిమూలం కలిసేవారు
అలా పరిచయమై ఆ తరువాత నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు
నామొబైల్‌కు పదేపదే కాల్స్ చేసేవాడు..
తిరుపతిలోని భీమాస్ హోటల్‌లో నుంచి రూమ్ నెంబర్ 109 లోకి రమ్మని చెప్పాడు
అక్కడ నన్ను బెదిరించి నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు
ఎవరికైనా చెబితే నాతో పాటు కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు
అలా నాపై మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు
చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజరూపాన్ని బట్టబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టుకున్నాను
లైంగికంగా తన కోరిక తీర్చకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎం ఎల్ ఏ బెదిరించాడు
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీ పార్టీలో ఉండొద్దు
ఆదిమూలం గురించి అందరికీ తెలియాలనే పెన్ కెమెరాలో రికార్డు చేశా
నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఎమ్మెల్యే 100 సార్లు కాల్ చేశాడు
రాత్రులు మెసేజ్‌లు చేసి వేధించేవాడు..
రోజుకు ఒక అమ్మాయితో ఎమ్మెల్యే ఎంజాయ్ చేసేవాడు
అందమైన అమ్మాయి కనబడితే చాలు తను నాతో ఉండాల్సిందేనని..
సత్యవేడు ఎమ్మెల్యే ఎంతో మందిని టార్చర్ చేశాడు
తిరుపతి భీమా ప్యారడైజ్ హోటల్‌కు ఎమ్మెల్యే నీచ చర్యలకు అడ్డా
ఇలాంటి వాళ్ళన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నా డిమాండ్
సత్యవేడు ఎమ్మెల్యేను ఎలాంటి కార్యక్రమాలకు పిలవకండి
ఇంటికి వచ్చాడని సంబరపడి పోకండి
ఇంటికి వస్తే మీ భార్య, మీ పిల్లలపై కన్నేస్తాడు
ఆది మూలం కామాంధుడు, రాక్షసుడు
ఇతని నుండి సత్యవేడు లోని పార్టీ మహిళా కార్యకర్తలను కాపాడాలి : బాధిత మహిళ
-
2024-09-05T12:00:29+05:30
తొలిసారిగా AI గ్లోబల్ సమ్మిట్.. రేవంత్‌తో బిగ్ షాట్‌ల భేటీ
హైదరాబాద్ HICC లో తొలిసారిగా AI గ్లోబల్ సమ్మిట్ 2024
ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హాజరైన మంత్రి శ్రీధర్ బాబు, వివిధ దేశాలకు చెందిన సంస్థల ప్రతినిధులు
ఇవాళ, రేపు రెండు రోజులపాటు కొనసాగనున్న సమ్మిట్
Making AI Work For Every One అనే థీమ్‌తో సదస్సు నిర్వహణ
ముఖ్యమంత్రితో IBM వైస్ ప్రెసిడెంట్ డానియల్ కాంబ్ భేటీ
AI లో భవిష్యత్తు అవకాశాలు, కొత్త ఆవిష్కరణలపై చర్చ
రేవంత్ రెడ్డితో Yotta Infrastructure Solution LLP సీఈవో సునీల్ గుప్తా భేటీ
హైదరాబాద్‌లో జీపీయూ ఆధారిత AI క్లౌడ్ ఏర్పాటులో భాగస్వామ్యంపై చర్చ
గ్లోబల్ సమ్మిట్‌లో AI రోడ్ మ్యాప్‌ను విడుదల చేసిన ముఖ్యమంత్రి
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన AI రోడ్ మ్యాప్
రోడ్ మ్యాప్‌లో 25 కార్యక్రమాలను పొందుపరిచిన ప్రభుత్వం
-
2024-09-05T11:43:25+05:30
మళ్లీ పెరుగుతోంది..!
గోదావరిలో మరింత పెరిగిన వరద ప్రవాహం
ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటిమట్టం 11 అడుగులుగా నమోదు
ఇక్కడి నుంచి సముద్రంలోకి 8.80 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
భద్రాచలం వద్ద గోదావరికి కొనసాగుతున్న వరద ఉద్ధృతి
నీటిమట్టం 44.3 అడుగులుగా నమోదైనట్లు తెలిపిన అధికారులు
కొనసాగుతోన్న మొదటి ప్రమాద హెచ్చరిక
-
2024-09-05T11:35:00+05:30
టెన్షన్.. టెన్షన్.. టెన్షన్!
సుప్రీంకోర్టులో సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు
లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో..
సుప్రీంకోర్టును ఆశ్రయించిన అర్వింద్ కేజ్రీవాల్
ఆగస్టు-05న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
ఆగస్టు-14న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సీబీఐకు నోటిసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కేజ్రీవాల్‌ను జూన్-26న అరెస్ట్ చేసిన సీబీఐ
కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వీ
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ముందు విచారణ
-
2024-09-05T11:30:52+05:30
ఎయిర్‌పోర్టులో లిక్కర్ పట్టివేత..
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసుల తనిఖీలు
పోలీసుల అదుపులో గోవా నుంచి మద్యం తెచ్చిన వ్యక్తులు
నిందితుల నుంచి 415 మద్యం బాటిళ్లు సీజ్
పట్టుకున్న మద్యం విలువ రూ.12 లక్షల ఉంటుందని అంచనా
-
2024-09-05T11:00:13+05:30
ఆ ముగ్గురి కోసం పోలీసుల వేట!
టీడీపీ ఆఫీస్, చంద్రబాబు నివాసంపై దాడుల కేసులో..
నిందితుల కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు
అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, రఘురాం కోసం..
ప్రత్యేక పోలీస్ బృందాలు పంపిన పోలీసులు
వైసీపీ నేత పానుగంటి చైతన్య కోసం వేట
ఎన్నికల ఫలితాలు నాటినుంచే పరారీలో చైతన్య
ఇప్పటికే మాజీ ఎంపీ నందిగాం సురేష్, విజయవాడ వైసీపీ నేత..
అవుతు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో నిందితులను విచారిస్తున్న పోలీసులు
అవినాష్, అప్పిరెడ్డి, రఘురామ్ ఫోన్లు స్విచ్చాఫ్ చేసి పరారీ
ఇందులో కొందరి ఆచూకీని కనిపెట్టిన పోలీసులు
చంద్రబాబు నివాసంపై దాడి కేసులో..
మాజీ మంత్రి జోగి రమేష్‌కు నిన్న ముందస్తు బెయిల్ తిరస్కరణ
జోగి రమేష్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి పరారీ
జోగి రమేష్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు
-
2024-09-05T10:40:54+05:30
ఊపిరి పీల్చుకో సింగ్ నగర్!
విజయవాడ సింగ్ నగర్‌లో బుడమేరు వరద తగ్గుముఖం
ఒక్కొక్కటిగా బయట పడుతున్న నీట మునిగిన ఇళ్లు
సహాయక చర్యలు ముమ్మరం చేసిన ప్రభుత్వం
ప్రధాన రోడ్ల పై ఉన్న బురద, చెత్తను క్లీన్ చేస్తున్న కార్మికులు
ఇంకా ముంపులోనే లోపల ఇళ్లు
రోడ్ల పైకి ఇప్పుడిప్పుడే వస్తున్న జనాలు
-
2024-09-05T10:40:14+05:30
పోలీసులు లంచం ఇవ్వాలనుకున్నారు..!
కోల్‌కతా వైద్యురాలి కుటుంబం సంచలన ఆరోపణలు
తమ కుమార్తె హత్యాచారం కేసును తప్పుదోవ పట్టించేందుకు..
పోలీసులు ప్రయత్నించారని కోల్‌కతా వైద్యురాలి తల్లిదండ్రులు ఆరోపణ
తమకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారన్న పేరేంట్స్
మేం దాన్ని తిరస్కరించామని
హడావుడిగా తమ కుమార్తె దహన సంస్కారాలు..
పూర్తి చేయించారన్న వైద్యురాలి కుటుంబం
మృతదేహాన్ని చూసేందుకు కూడా మమ్మల్ని అనుమతించలేదన్న తల్లి
పోస్ట్‌మార్టం పూర్తయ్యేంతవరకు పోలీస్‌స్టేషన్‌లోనే వెయిట్ చేయించారని ఆరోపణ
-
2024-09-05T10:35:20+05:30
కేజ్రీవాల్‌కు ఊరట దక్కుతుందా..?
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజీవాల్ బెయిల్ పిటిషన్‌తో పాటు..
అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్ కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించే ఛాన్స్
ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సీబీఐకి సుప్రీంకోర్టు ఆగస్టు- 23 వరకు అనుమతి
కౌంటర్‌పై సమాధానం ఇచ్చేందుకు కేజ్రీవాల్‌కు రెండురోజుల గడువు
బెయిల్‌తోపాటు సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు
అరెస్టుకు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఆగస్టు-05న ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేసిన కేజ్రీవాల్
పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో కోర్టు కేజ్రీవాల్‌కి ఊరట కలుగుతుందా లేదా అని ఆప్ శ్రేణుల్లో ఉత్కంఠ
ఈకేసులో సరైన సాక్ష్యాలు పొందుపరచకపోవడంతో మనీష్ సిసోదియా..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు
కేజ్రీవాల్ విషయంలో ఎలాంటి తీర్పు వస్తుందో అని సర్వత్రా ఆసక్తి
-
2024-09-05T10:25:01+05:30
ఖమ్మం కన్నీటి బాధలు..
హృదయాన్ని కదిలిస్తున్న ఖమ్మం కన్నీటి బాధలు
ఎవరైనా దాతలు వచ్చి ఏదైనా సాయం చేస్తారని ఎదురు చూపులు
దాతలు ఇచ్చే ఆహార పొట్లాలు తింటూ కనిపిస్తున్న చిన్నారులు
రోడ్డు పక్కనే అప్పు చేసి పెట్టుకున్న కిరాణా షాపులో..
పూర్తిగా తడిసిపోయిన వస్తువులు, దిక్కుతోచని స్థితిలో జనం
సర్టిఫికెట్లు, పుస్తకాలు తడిచిపోయి ఆరబెట్టుకుంటున్న దృశ్యాలు
ఇంట్లో బురద.. బయట వాన
ఖమ్మం మున్నేరు వరద బాధితుల దారుణ పరిస్థితి
బురద కారణంగా వీధుల్లో దుర్వాసన..
ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు..
ప్రతి ఇంటికీ రూ.లక్ష నుంచి 5 లక్షల దాకా నష్టం
-
2024-09-05T10:15:46+05:30
మైలవరంలో ఎడతెరిపి లేకుండా వర్షం
ఎన్టీఆర్ జిల్లా మైలవరంను వదలని వానలు
రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
డ్రైనులు పొంగి రోడ్లపై ప్రవహిస్తున్న వర్షపు నీరు
వర్షపు నీరుతో లోతట్టు ప్రాంతాలు జలమయం
లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టని అధికారులు
ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతో ఉదృతంగా ప్రవహిస్తున్న బుడమేరు
చండ్రగూడెం మల్లయ్య కుంటకు గండి
కొండ వాగు ప్రవాహంతో పొందుగల చౌడు చెరువు కింద వరి పొలాలు నీట మునక
వెల్వడం వద్ద ప్రమాదకర స్థాయిలో బుడమేరు
-
2024-09-05T10:00:16+05:30
నేడు వరద ప్రాంతాల్లో పర్యటనకు బీజేపీ నేతలు
ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాలకు బీజేపీ నేతలు
ఖమ్మం, కోదాడ ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్రమంత్రి బండి సంజయ్ బృందం
మహబూబాబాద్, ములుగు ప్రాంతాల్లో పర్యటించనున్న..
ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి బృందం
వరద నష్టంపై నివేదికను కేంద్ర పెద్దలకు ఇవ్వనున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం
-
2024-09-05T09:10:25+05:30
ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోలు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్
ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి
కరకగూడెం మండలం రఘునాథపాలెం సమీపంలోని..
అటవీ ప్రాంతంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఘటన
మృతుల్లో తెలంగాణకు మావోయిస్టు అగ్రనేత..?
ఇంకా అధికారికంగా ప్రకటించని మావోయిస్ట్ నేతలు, పోలీసు ఉన్నతాధికారులు
-
2024-09-05T09:00:34+05:30
మంగళగిరి పీఎస్‌కు సురేష్
మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు మాజీ ఎంపీ నందిగం సురేష్
గత రాత్రి హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
టీడీపీ కార్యాలయం దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ పేరు
హైకోర్టు బెయిల్ తిరస్కరణ.. రంగంలోకి దిగి అరెస్ట్ చేసిన పోలీసులు
-
2024-09-05T08:55:50+05:30
హైదరాబాద్‌లో భారీ మోసం..
ట్రేడింగ్ పేరుతో భారీ మోసం మోసం
రూ.13.16 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట ఓ సీనియర్ సిటిజన్ నుంచి..
రూ. 13.16 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
బాధితుడు ఫిర్యాదు మేరకు..
సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసు నమోదు.
ముగ్గురు నిందితులు అరెస్టు
ఆన్‌లైన్ స్టాక్ బ్రోకింగ్‌లో చేరాలంటూ కొన్ని లింకులు
మొదట్లో లాభాలు చూపించిన కేటుగాళ్లు..
ఆ తర్వాత బాధితుడి నుంచి రూ.13.16 కోట్లు వసూలు
మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు
-
2024-09-05T08:45:50+05:30
సాయం కోసం ఎదురుచూపులు
ఇంట్లో బురద.. బయట వాన
ఖమ్మం మున్నేరు వరద బాధితుల దారుణ పరిస్థితి
బురద కారణంగా వీధుల్లో దుర్వాసన..
ఇంట్లో ఉండలేరు.. బయట తిరగలేరు
ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు..
ప్రతి ఇంటికీ రూ.లక్ష నుంచి 5 లక్షల దాకా నష్టం
-
2024-09-05T08:30:16+05:30
ఐదో రోజూ కలెక్టరేట్‌లోనే చంద్రబాబు
వీడిన ముంపు తొలగిన ముప్పు
వరద నుంచి తేరుకుంటున్న బెజవాడ
80 శాతం ప్రాంతంలో నీరు తగ్గుముఖం
ఊపందుకుంటున్న సహాయ చర్యలు
ఐదో రోజూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోనే సీఎం నారా చంద్రబాబు
సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్న సీఎం
బాధితులకు పరిహారం ఇచ్చేందుకు నష్టంపై అంచనా
ఈఎంఐల రీ షెడ్యూల్ కోసం నిన్న బ్యాంకర్లతో సమావేశం
బుడమేరు గండ్లను పూడ్చివేసిన అధికారులు
వాహనాలకు 12 రోజుల్లో బీమా పరిహారం
వ్యాపారులు కోలుకోవడానికి ప్యాకేజీ..
ఇళ్లలో నష్టంపై ఆలోచిస్తున్నాం
నేటి నుంచి బియ్యం, పప్పు దినుసులు పంపిణీ: సీఎం చంద్రబాబు
-
2024-09-05T08:18:48+05:30
బెజవాడకు బిగ్ రిలీఫ్!
ఇప్పుడిప్పుడే వరద నుంచి ఊపిరి పీల్చుకుంటున్న విజయవాడ
వరద ముంపులో మరో 50 వేల మందికిపైగా బాధితులు
నేటి సాయంత్రానికి పూర్తిస్థాయిలో తరలింపు
బోట్లు అందుబాటులో ఉన్నా ఉపయోగించని అధికారులు
సింగ్‌నగర్ ఫ్లైఓవర్‌పైనే బోట్లు నిలిపివేత
స్వచ్ఛంద సంస్థల సహకారంతో సురక్షిత ప్రాంతాలకు బాధితులు
కొనసాగుతున్న అధికారుల నిర్లక్ష్యం
-
2024-09-05T08:16:04+05:30
వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్..
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక పరిణామం
ఈ కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ అరెస్ట్
హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన మంగళగిరి పోలీసులు
కొన్నిరోజులుగా సురేష్‌ను వేటాడుతున్న పోలీసులు!
సురేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
అజ్ఞాతంలోకి వెళ్లిన నందిగం సురేష్.. విదేశాలకు పారిపోయేందుకు యత్నం
పక్కా సమాచారంతో రంగంలోకి పోలీసులు.. గురువారం ఉదయాన్నే సురేష్ అరెస్ట్
మాజీ ఎంపీని గుంటూరు జిల్లాకు తరలిస్తున్న పోలీసులు
ముందుగా ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లే ఛాన్స్
ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్న మంగళగిరి పోలీసులు
-
2024-09-05T08:15:08+05:30
Breaking News Live Updates: ప్రపంచ నలుమూల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వరదల పరిస్థితి ఎలా ఉంది..? మినిట్ టు మినిట్ తాజా వార్తలను ఇక సులభంగా తెలుసుకోవచ్చు. మీకోసమే ప్రత్యేకంగా ఈ లైవ్ అప్‌డేట్స్ ప్లాట్‌ఫామ్.. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..