Home » Vizag News
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు (MVV Satyanarayana) ఏపీ హైకోర్టులో(AP High Court) ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు తెలిపింది.
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ పైన, గత వైసీపీ ప్రభుత్వ పెద్దలకు కన్ను పడిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) తెలిపారు. విశాఖలో వ్యాపారాల పైన గత వైసీపీ ప్రభుత్వం దృష్టిపడిందన్నారు. సినిమాల్లో సంబంధం లేని వాళ్లు కూడా ఈ క్లబ్లో రాజకీయంగా ఇందులో చొరబడ్డారని ఆరోపించారు.
ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రేపు(బుధవారం) సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈరోజు సెక్రటేరియట్కు వెళ్లిన పవన్ తన చాంబర్ను చూడటం, సంబంధిత శాఖ ఉన్నతాధికారులను పరిచయం చేసుకున్నారు.
గంజాయి నిర్మూలనకు విశాఖ పోలీస్ అధికారులు వందరోజుల ప్రణాళిక సిద్ధం చేశారు. ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత (Vangalapudi Anitha) ఆదేశాలతో, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులతో విశాఖ జిల్లా పోలీసులు గంజాయి రవాణాపై అలెర్ట్ అయ్యారు.
స్టీల్ ప్లాంట్ను పరిరక్షించే బాధ్యత పూర్తిగా తాను తీసుకుంటానని ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ (Palla Srinivasa Rao) తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కూర్మం పాలెం వద్ద చేపట్టిన దీక్ష1223 రోజులకు చేరుకుంది.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వాన్ని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ (Peethala Murthy Yadav) డిమాండ్ చేశారు. 2008లో ఏసీఏలో అక్రమాలకు పాల్పడినట్లు ఏపీ హైకోర్టులో కేస్ విచారణలో ఉందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును (Palla Srinivasa Rao) నియమించారు. ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ( CM Nara Chandrababu Naidu) ఈ రోజు (శుక్రవారం) అధికారికంగా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ సమావేశం జరగ్గా శాసన సభ పక్షనేతతో పాటు సీఎం అభ్యర్థిని ఏకగ్రీవంగా టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు ఎన్నుకున్నారు. సమావేశంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) హిందూ ధర్మాన్ని నాశనం చేశారని ఆంధ్రప్రదేశ్ సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామి (Sri Srinivasananda Saraswati) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్, శ్రీ శారదా పీఠం స్వరూపా నందేంద్ర సరస్వతిపై సంచలన ఆరోపణలు చేశారు.
'దిశ దివ్యాంగ్ సురక్ష' కు (Disha-Divyang Suraksha) బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిని నియమించారు. ఈ మేరకు విశాఖలోని బీచ్ రోడ్డులో వైజాగ్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో నేడు(శనివారం) 'దిశ దివ్యాంగ్ సురక్ష' కార్యక్రమం నిర్వహించారు.