Home » Warangal
చెడ్డీగ్యాంగ్, పార్థుగ్యాంగ్లను మించి ట్యాటూ గ్యాంగ్ హల్చల్ చేస్తోంది. తాజాగా, హనుమకొండ విద్యారణ్యపురిలోని ఓ ఇంట్లో ట్యాటూ గ్యాంగ్ దొంగతనానికి పాల్పడింది. ఇంటి కిటికీ గ్రిల్స్ ధ్వంసం చేసి ఇంట్లోకి ప్రవేశించింది.
Minister Seethakka: మంత్రి సీతక్క ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తన భర్త కుంజా రాము వర్థంతి సభలో సీతక్క కంటతడి పెట్టారు. సీతక్క కన్నీరు పెట్టుకోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణపై ఉత్కంఠకు తెరపడింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద సుమారు నాలుగైదులక్షల మందితో సభ నిర్వహించాలని నిర్ణయించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతేవాడా జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు, వారిలో సారయ్య, పండ్రు, మన్ను మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు
ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్ యూనిట్ కార్యాలయంలో కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి,మున్సిపల్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే హాజరయ్యారు.
ఇది ప్రజా పాలన కాదని... అంతా దొంగల పాలన అయిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఎండిన పంట పొలాలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
వరంగల్: కిలాడీ లేడీని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌లో ఓ కిలేడీ అరాచకాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్నాయి. అమాయక ఆడపిల్లలే లక్ష్యంగా ఆమె చేసిన ఘోరాలు సినీ స్టోరీని తలపిస్తున్నాయి. మత్తు మందులకు అలవాటు పడి ముఠాగా ఏర్పడిన వారంతా చేసిన అకృత్యాలు పోలీసులనే అవాక్కయ్యేలా చేస్తున్నాయి.
చేనేత కార్మికులకు రేవంత్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
వేసవిలో మనుషులే కాదు.. ఇతర జీవులూ ఉష్ణతాపంతో ఉక్కిరిబిక్కిరి కావడం పరిపాటి. సమ యానికి తాగునీరు దొరక్కపోతే అవస్థలు పడక తప్పదు. నిత్యం జనారణ్యంలో సంచరించే జంతువులు, పక్షులకు నీటి కొరత ఉండకపోవచ్చు గానీ.. వన్యప్రాణులకు మాత్రం తిప్పలు తప్పవు. వేసవిలో నీటి వనరులు అడుగం టిపోతే అవి విలవిలలా డుతుంటాయి.
కేసీఆర్ కుటుంబం రూ.లక్ష కోట్లు ఎలా సంపాదించిందో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ సంపాదన సీక్రెట్ ఏంటో ప్రజలకూ చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం నెలకు రూ.లక్ష సంపాదించే నైపుణ్యమైనా యువతకు చెప్పాలని అన్నారు.