Share News

Tattoo Gang: ఓరుగల్లు ప్రజల్ని వణికిస్తున్న ట్యాటూ గ్యాంగ్..

ABN , Publish Date - Mar 28 , 2025 | 10:00 PM

చెడ్డీగ్యాంగ్, పార్థుగ్యాంగ్‌లను మించి ట్యాటూ గ్యాంగ్ హల్‌చల్ చేస్తోంది. తాజాగా, హనుమకొండ విద్యారణ్యపురిలోని ఓ ఇంట్లో ట్యాటూ గ్యాంగ్ దొంగతనానికి పాల్పడింది. ఇంటి కిటికీ గ్రిల్స్ ధ్వంసం చేసి ఇంట్లోకి ప్రవేశించింది.

Tattoo Gang: ఓరుగల్లు ప్రజల్ని వణికిస్తున్న ట్యాటూ గ్యాంగ్..
Tattoo Gang

టెక్నాలజీ ఎంత అభివృద్ది చెందినా.. కొత్త కొత్త సైబర్ నేరాలు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నా.. ఓ విషయంలో మాత్రం మార్పు రావటం లేదు. అదే.. దొంగల గ్యాంగుల్లో.. నిన్న మొన్నటి వరకు చెడ్డీగ్యాంగ్, పార్థుగ్యాంగ్ తెలుగు రాష్ట్రాల్లో హల్‌చల్ చేశాయి. పలు నగరాల్లో దొంగతనాలకు పాల్పడ్డాయి. వీరి కారణంగా జనం రాత్రిళ్లు నిద్రలేకుండా అల్లాడిపోయారు. తర్వాత దొంగతనాలు ఆగిపోయాయి. జనం ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ దొంగతనాలు మొదలయ్యాయి. ఓరుగల్లులో కొత్త గ్యాంగ్ అలజడి సృష్టిస్తోంది. ట్యాటూ గ్యాంగ్ ప్రస్తుతం డ్యూటీకి ఎక్కింది. పక్కా ప్లాన్ ప్రకారం భారీ దోపిడీలకు పాల్పడుతోంది. విశాలంగా ఉండే ధనవంతుల ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తోంది.


తాజాగా, హనుమకొండ విద్యారణ్యపురిలోని ఓ ఇంట్లో ట్యాటూ గ్యాంగ్ దొంగతనానికి పాల్పడింది. ఇంటి కిటికీ గ్రిల్స్ ధ్వంసం చేసి ఇంట్లోకి ప్రవేశించింది. విలువైన వస్తువులు దొంగిలించింది. సీసీటీవీ కెమెరాల్లో ట్యాటూ గ్యాంగ్ దృశ్యాలు రికార్డు అయ్యాయి. పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దొంగల కోసం అన్వేషిస్తున్నారు. పోలీసుల విచారణలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్యాటూ గ్యాంగ్ సభ్యులు మామూలు దొంగలు కాదని, అంతర్రాష్ట్ర దొంగలని తేలింది. ఇక, ఆ ట్యాటూ గ్యాంగులో మొత్తం ఆరుగురు దొంగలు ఉన్నారు. వాళ్లు ముసుగులు ధరించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. గ్యాంగ్‌లోని ప్రతీ సభ్యుడి ఎడమ చేతిపై పచ్చబొట్టు ఉంది. వారి చేతుల్లో మారణాయుధాలు సైతం ఉన్నాయి.


వారి అదృష్టం బాగుంది.

విద్యారణ్యపురిలోని ఇంట్లోకి ట్యాటూ గ్యాంగ్ ప్రవేశించినపుడు ఇంట్లోని వారంతా గాఢ నిద్రలో ఉన్నారు. దొంగతనం జరుగుతున్న సంగతి కూడా వారికి తెలియలేదు. దొంగలు తమ పని ముగించుకుని అక్కడినుంచి వెళ్లిపోయారు. అయితే, దొంగతనం జరుగుతున్న సమయంలో ఇంట్లో వాళ్లు లేచి ఉంటే.. దారుణం జరిగి ఉండేది. ఆ గ్యాంగ్ తమను తాము రక్షించుకోవడానికి మారణాయుధాలతో దాడి చేసి ఉండేది. దేవుడి దయ వల్ల కుటుంబంలోని ఎవ్వరికీ మెలుకువ రాలేదు.


ఇవి కూడా చదవండి:

Minister Uttam: సన్న బియ్యం పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Satya Kumar Yadav: ఏపీ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు

Updated Date - Mar 28 , 2025 | 10:00 PM