Home » YSRCP
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీమోహన్‌కు విజయవాడ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వంశీని పోలీసులు విజయవాడ హనుమాన్ పేటలోని జిల్లా కారాగారానికి తరలించారు. జైల్లో వంశీ చిందులు తొక్కుతున్నారు.
Dola Bala Veeranjaneya Swamy:వైసీపీ నేతలకు మంత్రి బాలవీరాంజనేయస్వామి మాస్ వార్నింగ్ ఇచ్చారు. వారు మారకపోతే తాట తీస్తామని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ నేత వల్లభనేని వంశీ దుశ్చర్యల గురించి మాట్లాడామని తెలిపారు.
Somireddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూముల్లో ఎంత దోపిడీ చేశావో అందరికీ తెలుసునని చెప్పారు. ఎన్నికల కోడ్‌కు ఒక్క రోజు ముందు కాకాణి గోవర్ధన్ రెడ్డి 57.5 ఎకరాలు కొట్టేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
Denduluru Politics: ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై హత్యాయత్నం జరిగింది. ఓ వివాహ వేడుకలో చింతమనేని ప్రభాకర్ , మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఈ వివాదంలో చింతమనేని డ్రైవర్, గన్‌మ్యాన్‌లపై అబ్బయ్యచౌదరి దాడికి పాల్పడ్డారు.ఈ దాడితో అబ్బయ్యచౌదరి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
బెదిరింపులు, కిడ్నాప్ కేసులో పోలీసులు అరెస్టు చేసిన వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌కు విజయవాడ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు కిడ్నాప్ కేసుపై 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో వంశీని పోలీసులు విజయవాడ హనుమాన్ పేటలోని జిల్లా కారాగారానికి తరలించారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు విచారణ జరుగుతుండగానే ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కేసును విత్ డ్రా చేసుకున్నారు. కేసు విత్ డ్రా చేసుకోవాలని వైసీపీ నేతలు కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగడంతో బాధితుడు ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు.
Vamsi Arrest: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. వంశీ పాపం పండిందని నేతలు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టిన బాధితులు ధైర్యంగా బయటకు వస్తున్నారని టీడీపీ నేతలు అన్నారు.
ఏలూరు జిల్లా వట్లూరులో ఓ వివాహ కార్యక్రమానికి దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. అయితే ఫంక్షన్ హాల్ కారిడార్ మధ్యలో చింతమనేని వాహనానికి అడ్డుగా వైసీపీ నేత అబ్బయ్య చౌదరి డ్రైవర్ తన కారును పెట్టాడు.
YCP vs TDP: ఏలూరు జిల్లాలో మరోమారు వైసీపీ, టీడీపీ నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. ఓ కార్యక్రమంలో ఇరువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో ఏలూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల జోక్యం చేసుకుని ఇరు పార్టీల వారిని శాంతపరిచారు.
వల్లభనేని వంశీ అరెస్టును మాజీ మంత్రి బొత్స సత్యానారయణ ఖండించారు. కేసు వెనక్కు తీసుకుంటే మళ్ళీ అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. కక్షపూరిత రాజకీయాలు సరికాదని అన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను శాసనమండలిలో ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు.