Share News

Gannavaram: వైసీపీ నేతలకు భారీ షాక్.. ఆ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు..

ABN , Publish Date - Feb 13 , 2025 | 06:27 PM

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు విచారణ జరుగుతుండగానే ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కేసును విత్ డ్రా చేసుకున్నారు. కేసు విత్ డ్రా చేసుకోవాలని వైసీపీ నేతలు కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగడంతో బాధితుడు ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు.

Gannavaram: వైసీపీ నేతలకు భారీ షాక్.. ఆ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు..
TDP office attack case

అమరావతి: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు (TDP office attack case)లో నిందితులకు విజయవాడ కోర్టు (Vijayawada court) షాక్ ఇచ్చింది. 31 మంది నిందితులు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ (Anticipatory Bail Petition)ను కోర్టు కొట్టివేసింది. నిన్న (బుధవారం) కేసుకు సంబంధించిన వాదోపవాదనలు ముగిశాయి. ఈ మేరకు నేడు(గురువారం) వారి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇదే కేసులో రిమాండ్‌ ఖైదీలుగా జైలులో ఉన్న ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది.


ఈ కేసు విచారణ జరుగుతుండగానే కోర్టుకు వచ్చిన ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కేసును విత్ డ్రా చేసుకున్నారు. కేసు విత్ డ్రా చేసుకోవాలని వైసీపీ నేతలు కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగడంతో బాధితుడు ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. కాగా, బాధితుడి ఫిర్యాదు మేరకు కిడ్నాప్ ఘటనపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గురువారం ఉదయం హైదరాబాద్‌లో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. కాగా, కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేత వంశీని పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. వంశీ భార్య జైలు బయటే ఆయన కోసం ఎదురుచూస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

AP News: వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో రెండు కేసులకు రంగం సిద్ధం..

Eluru: మీరు దాడులు చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా.. వైసీపీ నేతకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే..

Updated Date - Feb 13 , 2025 | 06:32 PM