Home » YSRCP
నటి జత్వాని కేసులో నిందితుడు విద్యాసాగర్ బెయిల్ పిటిషన్పై ఈ నెల 5న హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో బెయిల్ పిటిషన్పై తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసింది. సోమవారం (9వ తేదీ) తీర్పు వెల్లడించనున్నట్లు పేర్కొంది.
వైఎస్సార్సీపీ హయాంలో ఎంతో కష్టపడి తీర్చిదిద్దిన ప్రభుత్వ స్కూళ్లను, విద్యారంగాన్ని నాశనం చేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అమ్మకు వందనం పేరిట తల్లిదండ్రులకు సున్నం రాసి, వారిని దగాచేశారని జగన్ విమర్శించారు.
ఈనెల12వ తేదీ వరకు ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని అరెస్టు చేయొద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పులివెందులలో రాఘవరెడ్డి ప్రత్యక్షమయ్యాడు.సోషల్ మీడియా కేసులో విచారణకు రావాలని రాఘవరెడ్డి ఇంటికి పులివెందుల పోలీసులు వెళ్లిన విషయం తెలిసిందే.నోటీసులు ఇస్తే విచారణకు వస్తానని రాఘవరెడ్డి చెప్పారు.
ఆడపిల్లలకు మేనమామ అంటూ రాష్ట్రంలో వేల మంది అపహరణకు గురవుతున్నా ఏనాడూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద అని. ఆ సంపదను కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ కలసి రావాలని పిలుపునిచ్చారు.
జగన్ ప్రభుత్వ అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరుతామని చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. అధికారుల పనితీరు మారకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, దూషణలు, బెదిరింపులతో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ రెచ్చిపోయాడు. ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నాడు. కోర్టు అనుమతితో అనిల్ను అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీసులు శనివారం కస్టడీకి తీసుకున్నారు.
అదానీ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాత్రపై ఏపీ ప్రభుత్వం విచారణ చేయించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ స్కాంపై ఏసీబీతో విచారణ చేయించాలని కోరారు. ఈ స్కాంలో నిజాలు నిగ్గుతేల్చాలని అన్నారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, కూటమి నేతలను అసభ్య పదజాలంతో ధూషించిన బోరుగడ్డ అనిల్ కుమార్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. అనంతపురం కేసులో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అతన్ని అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో టీడీపీ నేతలు, పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడుల, పెట్టిన కేసుల తాలూకా ఒక్కొక్కటిగా పోలీసులు బయటకు తీస్తున్నారు.. ఈ క్రమంలోనే గుడివాడ టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించిన వ్యవహారాన్ని వెలికితీశారు. వైసీపీ అధికారంలోకి ఉండగా కొడాలి నాని, ఆయన అనుచరులు, స్థానిక నేతలు.. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావును ఎంతలా ఇబ్బంది పెట్టారో అందరూ చూసే ఉంటారు. వైసీపీ నేతలను గుడివాడలో వరుస అరెస్ట్లు చేస్తున్నారు.
జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు ప్రైవేట్ ఆస్తులు కొల్లగొట్టారు, ప్రభుత్వ ఖజానా లూటీ చేశారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. వైసీపీ హయాంలో రీసర్వే పేరిట భూములు కొట్టేశారని ఆరోపించారు. రీసర్వే పేరుతో ఊరికో భూబకాసురుడిని తయారుచేశారని ధ్వజమెత్తారు.