Home » YSRCP
2019 నుంచి 2024 వరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానుల నుంచి వినిపించిన మాటలు ఇవే.. అధికారం ఉందనే అహంతో తాము ఏమి చేసినా చెల్లుతుందనుకుని ఇష్టారాజ్యంగా రెచ్చిపోయారు. పార్టీ శ్రేణులు హద్దులు దాటుతుంటే హెచ్చరించాల్సిన మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి సైలెంట్‌గా ఉండటమే కాకుండా..
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఆరోపించారు. నిజంగా వైసీపీ కార్యకర్త తప్పుడు పోస్టులు పెడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు చట్టం ప్రకారం వ్యవహారించాలని అన్నారు.
అందరినీ అసభ్య పదజాలంతో దూషించిన బోరుగడ్డ అనిల్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏఈఎల్సీ చర్చి వివాదం కేసులో అనిల్‌ను పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపరచగా,.. రిమాండ్ విధించింది.
రబీ సీజన్లో 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని తీర్మానం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. సోమశిల నుంచి 55.100 టీఎంసీల నీటిని 5.51లక్షల ఎకరాలకు, కండలేరు నుంచి 22.600 టీఎంసీలతో 2.26లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
జగన్ మాత్రమే కాదు.. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా అసెంబ్లీకి వెళ్లనంటే.. తమ పదవులకు రాజీనామా చేయాలని షర్మిల సవాల్ విసిరారు. సొంత సోదరుడైనప్పటికీ కొంత కాలంగా రాజకీయంగా జగన్, షర్మిల మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో జగన్ వ్యాఖ్యలపై షర్మిల ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తున్నారు. మీడియా సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారా అంటూ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ..
ప్రభుత్వం ఫేక్‌గాళ్లపై చర్యలు తీసుకుంటామంటే జగన్ ఎందుకు బాధపడుతున్నారనో అర్థం కావడంలేదట. ప్రభుత్వం చర్యలు మొదలుపెడితే తమ తరపున ఫేక్ ప్రచారం చేసేవాళ్లు ఉండరని, దీంతో ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయకపోతే కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తే తమ పార్టీ మనుగడ ఏమి కావాలనే భయంతోనే సీఎం ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే..
Adhrapradesh: హిట్లర్ లాంటి వారే దిక్కూమొక్కు లేకుండా చనిపోయారని.. అలాంటి పరిస్థితే టీడీపీ పెద్దలకు కూడా వస్తుందని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కష్టసుఖాలను పట్టించుకోకుండా జనం మీద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా వలనే చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతి బయటపడుతోందన్నారు.
నటనలోనూ జగన్ జీవించేశారని, సినిమాలో నటిస్తే నిజంగా నటుడి పాత్రకు న్యాయం చేయగలరనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం వెంటనే జగన్‌కు రాజకీయాల్లో ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వాలని కోరుతున్నారట. 2019 నుంచి 2024 వరకు తన అరాచక పాలనతో రాష్ట్రాన్ని..
ప్రతిపక్ష నేత హోదా విషయంలో జగన్ రెండు నాల్కల ధోరణి ఇదిగో అంటూ ఎక్స్‌లో అప్పటి వ్యాఖ్యలను, ఇప్పటి వ్యాఖ్యలను పక్కపక్కనపెట్టి షేర్ పోస్టు చేస్తున్నారు. అలాగే జగన్ నిజ స్వరూపం ఇదేనంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. చెప్పేదొకటి, చేసేదొకటి అంటూ మరికొందరు నెటిజన్లు..
Andhrapradesh: అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టడంతో పాటు ఫోటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో నిందితుడు ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు వీరబత్తుల చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.