పాతబస్తీలో రౌడీషీటర్ దారుణ హత్య

ABN , First Publish Date - 2021-05-21T12:32:51+05:30 IST

నగరంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు రౌడీషీటర్‎ను దారుణంగా హత్య చేశారు. పాతబస్తీ బహదూర్ పురా సమీపంలోని కిషన్ బాగ్‎లో

పాతబస్తీలో రౌడీషీటర్ దారుణ హత్య

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు రౌడీషీటర్‎ను దారుణంగా హత్య చేశారు. పాతబస్తీ బహదూర్ పురా సమీపంలోని కిషన్ బాగ్‎లో రౌడీషీటర్ ఐజాజ్ ని రాడ్లతో కొట్టి, బండరాళ్లతో మోదీ దారుణంగా హతమార్చారు దుండగులు. రౌడీషీటర్ హత్యతో ఒక్కసారిగా పాతబస్తీ ఉలిక్కిపడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఐజాజ్ గతంలో ఫలక్‎నుమాలో మొహమ్మద్ ఫిరోజ్ హత్య కేసులో నిందితుడుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-05-21T12:32:51+05:30 IST