మర్రి శశిధర్‌రెడ్డి చైర్మన్‌గా. . కాంగ్రెస్ మేనిఫెస్టో
ABN , First Publish Date - 2020-11-08T06:46:33+05:30 IST
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు మేనిఫెస్టోను రూపొందించేందుకు మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి చైర్మన్‌గా టీపీసీసీ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కన్వీనర్‌గా ఏఐసీసీ అధికార

కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు
హైదరాబాద్, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు మేనిఫెస్టోను రూపొందించేందుకు మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి చైర్మన్‌గా టీపీసీసీ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కన్వీనర్‌గా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, సభ్యులుగా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు వ్యవహరిస్తారు. ఈ కమిటీ.. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కాంగ్రెస్ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపి మేనిఫెస్టోను రూపొందించనుంది.
ఈ మేనిఫెస్టోను ఈ నెల 23న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాగూర్ విడుదల చేయనున్నారు. కాగా.. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజల వాణిని ప్రతిబింబిస్తుందని, నగర అభివృద్ధికి మెరుగైన ప్రణాళికలను రూపొందిస్తుందని మణిక్కం ఠాగూర్ ట్వీట్ చేశారు.