నేడు అటుకుల బతుకమ్మ
ABN , First Publish Date - 2020-10-17T05:30:00+05:30 IST
ప్రకృతి స్వరూపిణిగా తెలంగాణ ప్రజలు ఆరాధించే బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి.

ప్రకృతి స్వరూపిణిగా తెలంగాణ ప్రజలు ఆరాధించే బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సంబురాల్లో రెండో రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు (శనివారం) ప్రధానంగా అటుకులను నివేదిస్తారు కాబట్టి ‘అటుకుల బతుకమ్మ’గా గౌరమ్మను పిలుస్తారు. రెండు ఎత్తుల్లో గౌరమ్మను పేర్చి, ఆటపాటలతో వేడుక జరుపుకొంటారు.
ఈ రోజు నైవేద్యం: సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు