Kurta Designs : సాదా కుర్తాని స్టయిల్‌గా మార్చేద్దాం..!
ABN , Publish Date - Mar 24 , 2025 | 01:03 AM
సాదా కుర్తాని పలు కాంబినేషన్లతో స్టయిల్‌గా ఎలా మార్చాలో తెలుసుకుందాం. సాదా కుర్తాకి జతగా భారీగా ఎంబ్రాయిడరీ చేసిన షెరారా ధరిస్తే హుందాగా కనిపిస్తారు.

ఒకే రంగులో ఉన్న సాదా కుర్తాలు ఎలాంటి శరీరాకృతి ఉన్నవారికైనా చక్కగా నప్పుతాయి. వీటిని మళ్లీ మళ్లీ వేసుకోవాలంటే మాత్రం ఇష్టంగా అనిపించదు. అందుకే సాదా కుర్తాని పలు కాంబినేషన్లతో స్టయిల్‌గా ఎలా మార్చాలో తెలుసుకుందాం.
సాదా కుర్తాకి జతగా భారీగా ఎంబ్రాయిడరీ చేసిన షెరారా ధరిస్తే హుందాగా కనిపిస్తారు.
ముదురు రంగు సాదా కుర్తా మీద పెద్ద ప్రింట్లు ఉన్న చున్నీ వేసుకుంటే బాగుంటుంది. జరీ వర్క్ ఉన్న దుపట్టా వేసుకున్నా అందంగా కనిపిస్తారు. చున్నీ లేదా దుపట్టాకు మ్యాచ్ అయ్యేలా పైజమా ఎంచుకుంటే డ్రెస్ చక్కగా ఉంటుంది.
సాదా కుర్తాకి గుండ్రని మెడ కాకుండా మంచి డిజైన్ ఉండేలా చూసుకుంటే మంచి లుక్ వస్తుంది. హాల్టర్ నెక్, డీప్ వి నెక్ డిజైన్లు ప్రయత్నించవచ్చు. నెక్ డిజైన్ మీద కుందన్స్, అద్దాలు, రంగురంగుల పూసలు, మెరిసే రాళ్లు అమరిస్తే డ్రెస్ ఇంకాస్త రిచ్‌గా కనిపిస్తుంది.
లేత రంగు కుర్తాకి ముదురు రంగు అంచుతో డిజైన్ చేసుకోవచ్చు. అంచుకి మ్యాచ్ అయ్యేలా సల్వార్, చున్నీ తెచ్చుకుని వేసుకుంటే గ్రాండ్ లుక్ వస్తుంది.
ప్లెయిన్ కుర్తా మీద చక్కగా సూటయ్యే లెగ్గింగ్ వేసుకుని చెవులకు పెద్ద జుంకాలు లేదా ట్రెండింగ్‌లో ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఫ్యాషన్‌గా కనిపిస్తారు.
ఇవీ చదవండి:
రోహిత్ చెత్త రికార్డు.. 18వ సారి..
సెంచరీకి అతడే కారణం.. ఒక్క మాటతో..: ఇషాన్
సొంత రికార్డును బ్రేక్ చేసిన ఎస్ఆర్‌హెచ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి