టెక్ వ్యూ : కన్సాలిడేషన్‌కు ఆస్కారం
ABN , Publish Date - Mar 24 , 2025 | 04:19 AM
నిఫ్టీ గత వారం బలమైన ర్యాలీతో ఐదు ట్రేడింగ్ దినాలూ లాభాల్లోనే కదలాడి చివరికి ముందు వారంతో పోల్చితే 950 పాయింట్ల లాభంతో ముగిసింది....

టెక్ వ్యూ : కన్సాలిడేషన్‌కు ఆస్కారం
నిఫ్టీ గత వారం బలమైన ర్యాలీతో ఐదు ట్రేడింగ్ దినాలూ లాభాల్లోనే కదలాడి చివరికి ముందు వారంతో పోల్చితే 950 పాయింట్ల లాభంతో ముగిసింది. ఐదు వారాల నిరంతర కరెక్షన్ అనంతరం ఏర్పడిన టెక్నికల్ పునరుజ్జీవం ఇది. మిడ్‌క్యాప్-100 (7.7ు), స్మాల్‌క్యాప్-100 (8.6ు) సూచీలు కూడా ఇదే విధమైన ర్యాలీలో నడిచాయి. అయితే ఐదు రోజుల ర్యాలీ కారణంగా ఇప్పుడు కన్సాలిడేట్ కావలసి ఉంది. ప్రధాన ట్రెండ్ పాజిటివ్‌గానే ఉన్నా ఈ వారంలో జోరు కొంత తగ్గవచ్చు. తదుపరి నిరోధం 23,500.
బుల్లిష్ స్థాయిలు: సానుకూలత కోసం ప్రస్తుత గరిష్ఠ స్థాయిల్లో కన్సాలిడేషన్ అనంతరం తదుపరి నిరోధం 23,500 కన్నా పైన నిలదొక్కుకోవలసి ఉంటుంది. ప్రధాన నిరోధం 24,000.
బేరిష్ స్థాయిలు: ఏ మాత్రం బలహీనత ప్రదర్శించినా భద్రత కోసం మద్దతు స్థాయి 22,200 వద్ద నిలదొక్కుకోవాలి. విఫలమైతే మరింత బలహీనపడుతుంది. ప్రధాన స్వల్పకాలిక మద్దతు స్థాయి 22,000. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక కరెక్షన్‌లో పడుతుంది.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ కూడా 2,500 పాయింట్ల బలమైన ర్యాలీతో 50,600 వద్ద ముగిసింది. నిరోధ స్థాయి 50,700 వద్ద కన్సాలిడేట్ కావచ్చు. ఆ పైన మాత్రమే స్వల్పకాలిక సానుకూలత ఏర్పడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 50,000. ఇక్కడ విఫలమైతే స్వల్పకాలిక బలహీనత తప్పదు.
పాటర్న్: గత శుక్రవారం నిఫ్టీ 50 డిఎంఏను దాటింది. ఇప్పుడు 23,500 సమీపంలో ఉన్న 100 డిఎంఏకు చేరువవుతోంది. ఇక్కడ కన్సాలిడేషన్ ఉండవచ్చు. ఆర్‌ఎ్‌సఐ సూచీల ప్రకారం స్వల్పకాలిక ఓవర్‌బాట్ స్థితిలో ప్రవేశిస్తున్నందు వల్ల ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలి. సానుకూలత కోసం 23,500 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ కన్నా పైన నిలదొక్కుకోవాలి.
టైమ్: ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 23,440, 23,500
మద్దతు : 23,280, 23,200
వి. సుందర్ రాజా
ఇవి కూడా చదవండి:
Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
Onion Prices: గుడ్ న్యూస్..ఎగుమతి సుంకం రద్దు, తగ్గనున్న ఉల్లి ధరలు..
Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News