Share News

ఈ వారం నిలదొక్కుకుంటేనే!

ABN , Publish Date - Mar 24 , 2025 | 04:22 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మెరుగ్గా కదలాడే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు కనిపించటం లేదు. మరోవైపు భారత ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి...

ఈ వారం నిలదొక్కుకుంటేనే!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మెరుగ్గా కదలాడే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు కనిపించటం లేదు. మరోవైపు భారత ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి పెట్టుబడుల రాక మొదలైంది. గత శుక్రవారం 23,350 వద్ద ముగిసిన నిఫ్టీకి 23,800 వద్ద తక్షణ నిరోధం ఉంది. అయితే ప్రస్తుత స్థాయిలోనే మరింత కన్సాలిడేట్‌ అవ్వటం ముఖ్యం. అప్పుడే సూచీకి మరింత పటిష్ఠత లభిస్తుంది. ఇన్వెస్టర్లలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.

స్టాక్‌ రికమండేషన్స్‌

టీవీఎస్‌ మోటార్స్‌: గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ షేరు డౌన్‌ట్రెండ్‌లోనే కొనసాగుతూ వస్తోంది. దాదాపు 25 శాతం వరకు దిద్దుబాటుకు లోనయ్యాయి. కీలకమైన రూ.2,230 స్థాయిలో డబుల్‌ బాటమ్‌ ఏర్పడింది. అక్కడి నుంచి మళ్లీ టర్న్‌ అరౌండ్‌ మొదలైనట్లు కనిపిస్తోంది. గత వారం ఐదు సెషన్లలోనూ ఈ షేరు వరుసగా లాభపడింది. గత శుక్రవారం రూ.2,413 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.2,400 స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.,2,550/2,600 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.2,360 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


మ్యాన్‌కైండ్‌ ఫార్మా: జీవితకాల గరిష్ఠ స్థాయి నుంచి 30 శాతం మేర దిద్దుబాటుకు లోనైన ఈ షేరు ప్రస్తుతం దూకుడును ప్రదర్శిస్తోంది. చివరి రెండు సెషన్లలో భారీ వాల్యూమ్‌తో 12 శాతం మేర లాభపడింది. ఫార్మా రంగంలో మంచి మూమెంటమ్‌ కనిపిస్తుండటం శుభపరిణామం. గత శుక్రవారం రూ.2,415 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.2,350 స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.2,540 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.2,310 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఎస్‌బీఐ లైఫ్‌: సెప్టెంబరు నుంచి డౌన్‌ట్రెండ్‌లో కొనసాగిన ఈ కౌంటర్‌లో ఈ ఏడాది ఆరంభం నుంచి అక్యుములేషన్‌ మొదలైంది. మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ ఈ షేరు బలాన్ని ప్రదర్శించింది. గత వారం దాదాపు 12 శాతం మేర పెరిగింది. ప్రస్తుతం ఈ షేరు కీలకమైన రూ.1,550 నిరోధ స్థాయికి చేరుకుంది. ఈ స్థాయిని బ్రేక్‌ చేస్తే మరింత పెరగటం ఖాయం. గత శుక్రవారం రూ.1,546 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,520 స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.1,660/1,690 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,480 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


ఎంఆర్‌పీఎల్‌: గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ షేరు డౌన్‌ట్రెండ్‌లోనే కొనసాగుతూ వస్తోంది. తాజాగా భారీ వాల్యూమ్‌తో రేంజ్‌ ఎక్స్‌పాన్షన్‌ కనిపిస్తోంది. ఈ షేరు గత నెల 22 శాతం, గత వారం 13 శాతం మేర పెరిగింది. గత శుక్రవారం 14శాతం లాభంతో రూ.135 వద్ద క్లోజైంది. మదుపరులు ఈ కౌంటర్‌లో రూ.130 శ్రేణిలో ఎంటరై రూ.165 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.120 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఎన్‌హెచ్‌పీసీ: రెండు నెలలుగా ఈ కౌంటర్‌లో మంచి బేస్‌ ఏర్పడుతోంది. డార్వాస్‌ బాక్స్‌ ప్యాటర్న్‌ కనిపిస్తోంది. ప్రస్తుతం స్వల్పకాల నిరోధం రూ.82కి చేరుకుంది. దీన్ని అధిగమిస్తే మూమెంటమ్‌ పెరగవచ్చు. గత వారం ఈ షేరు 6 శాతం మేర పెరిగింది. గత శుక్రవారం రూ.82 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.80 వద్ద పొజిషన్‌ తీసుకుని రూ.115 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.76 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..

Onion Prices: గుడ్ న్యూస్..ఎగుమతి సుంకం రద్దు, తగ్గనున్న ఉల్లి ధరలు..

Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 24 , 2025 | 04:22 AM