ప్రభాకరన్ అసలు రూపం ఇదే!
ABN , First Publish Date - 2020-10-03T23:05:43+05:30 IST
వేలుపిల్లై ప్రభాకరన్ కొంతమందికి స్వాతంత్ర్య సమర యోధుడైతే, మరికొందరికి మాత్రం ఒక క్రూరమైన తీవ్రవాది. ...

వేలుపిల్లై ప్రభాకరన్ కొంతమందికి స్వాతంత్ర్య సమర యోధుడైతే, మరికొందరికి మాత్రం ఒక క్రూరమైన తీవ్రవాది. ఒక దేశాధ్యక్షుడు. ఒక మాజీ ప్రధాని హత్య, మరో అధ్యక్షుడిపై హత్యాయత్నంతో పాటు ఎన్నో రాజకీయ హత్యలు, ఆత్మాహుతి దాడులు, వందలాది మంది ప్రజలు, సైనికుల మరణానికి ప్రభాకరన్ బాధ్యుడని చెప్పొచ్చు. ఇవన్నీ ఆయన ఒక ప్రమాదకరమైన వ్యక్తి అనే విషయాన్ని స్పష్టంచేశాయి.
ఒసామా బిన్ లాడెన్ ఆదేశాలతో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేయడానికి ముందు ప్రభాకరన్ అనుచరులు కొలంబోలోని జనావాసాల్లో అలాంటి ఎన్నో భవనాలను భూస్థాపితం చేశారు. కానీ ఒసామాలా ప్రభాకరన్ సంపన్న కుటుంబానికి చెందిన వాడు కాదు. ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడ్డానికి ఆయన వేరే దేశంలోకి వెళ్లి దాక్కోలేదు. వేరే మతంలోకి ప్రేరణ కూడా పొందలేదు. ప్రభాకరన్‌కు ఒకే మతం తమిళ జాతీయ వాదం. మామూలు ఆయుధాలు, యాభై కంటే తక్కువ మంది అనుచరులు ఉన్న స్థాయి నుంచి కేవలం దశాబ్దంలోనే ఎల్‌టీటీఏని 10 వేల మంది సైనికులు ఉన్న ఒక సంస్థగా మార్చారు. అంటే ఒక దేశ సైన్యానికి సవాల్ విసిరగలిగే స్థాయికి తీసుకొచ్చారు.