Viral Video: కర్మ ఫలితం అంటే ఇదే.. దొంగను ఆ దేవుడే శిక్షించాడు..
ABN , Publish Date - Apr 02 , 2025 | 02:54 PM
Viral Video: రోడ్డు ప్రక్కన ముగ్గురూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నిర్మానుషంగా ఉన్న ఆ రోడ్డు మీదకు ఓ వ్యక్తి నడుచుకుంటూ వచ్చాడు. వారి దగ్గరకు వచ్చీ రాగానే కత్తితో బెదిరించాడు. యువకుడ్ని కత్తితో పొడవడానికి ప్రయత్నించాడు.

పొట్టోడిని పొడుగోడు కొడితే.. పొడుగోడిని ఆ పోచమ్మ కొట్టిందంట అని ఓ సినిమాలో హీరో డైలాగ్ చెబుతాడు. ఏమీ చేయలేరు కదా అని బలహీనులను మనం హింసిస్తే.. మనల్ని ఆ దేవుడు హింసిస్తాడు. కర్మ ఫలితం కచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. కర్మ ఏ రూపంలోనైనా మనల్ని వెంటాడుతుంది.. శిక్షిస్తుంది. తాజాగా, ఓ దొంగ విషయంలో అదే జరిగింది. దొంగతనం చేసే క్రమంలో ఆ దొంగ ఓ యువకుడ్ని కత్తితో పొడవాలనుకున్నాడు. తీవ్రంగా ప్రయత్నించాడు. చివరకు ఆ కత్తి అతడి పొట్టలోకే దిగింది. ఈ సంఘటన ఎక్కడ ? జరిగిందో తెలీదు కానీ.. ఇందుకు సంబంధించిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియో ప్రకారం.. అది రాత్రి సమయం.. రోడ్డు మొత్తం నిర్మానుషంగా ఉంది. ఓ ఇద్దరు అమ్మాయిలు..ఓ అబ్బాయి రోడ్డు పక్కన నిల్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓ వ్యక్తి నడుచుకుంటూ వీళ్ల దగ్గరకు వచ్చాడు. వచ్చీ రాగానే కత్తి తీసి వారిని బెదిరించాడు. దొంగతనానికి అబ్బాయి అడ్డుగా ఉంటాడని చెప్పి.. కత్తితో అతడ్ని బెదిరించడానికి చూశాడు. అది కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఆ దొంగ అబ్బాయిని కత్తితో పొడవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలోనే కత్తి అతడి పొట్టలోకి దిగబడింది. రక్తం కారసాగింది. దీంతో దొంగ.. అబ్బాయిని వదిలిపెట్టిపారిపోయాడు.
రెండు, మూడు కెమెరాల్లో అతడు గాయం అయిన పొట్ట భాగాన్ని పట్టుకుని పరుగులు తీస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. అతడి పొట్టనుంచి రక్తం ధారాపాతంగా కారుతూ ఉంది. అతడు సరిగా నడవను కూడా నడవ లేకపోతున్నాడు. నొప్పితో అటు, ఇటు ఊగుతూ నడుస్తున్నాడు. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘కర్మ ఫలం అంటే ఇదే.. తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించక తప్పదు’.. ‘ స్టోరీలో ట్విస్ట్ .. ఎండింగ్ మామూలుగా లేదు’.. ‘ సొంత కత్తే అతడ్ని మోసం చేసింది. ఇది కదా దేవుడి లీల అంటే..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి, ఈ వీడియోపై మీరెమనుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
Lalu Prasad Yadav: లాలూ ఆరోగ్యం ఆందోళనకరం.. నిమ్స్‌లో చేరే అవకాశం