Share News

Earths poles from space: వినాశనానికి సిద్ధంగా ఉండండి.. ముంపు ముంచుకొస్తోంది..

ABN , Publish Date - Apr 02 , 2025 | 05:20 PM

Earths poles from space: ఎలన్ మస్క్‌కు చెందిన స్పెస్ ఎక్స్ ఫ్రేమ్ 2 మిషన్ ద్వారా అంతరిక్షంనుంచి భూమిపై ఉండే ధ్రువాలను వీడియో తీశారు. ఆ వీడియోను ఎలన్ మస్క్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ వీడియో 7 గంటల్లోనే 12 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది. మనం ఆ వీడియోలో మంచులో పగుళ్లను గుర్తించవచ్చు.

Earths poles from space: వినాశనానికి సిద్ధంగా ఉండండి.. ముంపు ముంచుకొస్తోంది..
Earths poles from space

ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన స్పెస్ ఎక్స్ ఫ్రేమ్ 2 మిషన్ రికార్డు నెలకొల్పింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ సాయంతో అంతరిక్షంలోకి వెళ్లిని వ్యోమగాములు అక్కడి నుంచి భూమిపై ఉండే ఉత్తర, దక్షిణ ధ్రువాలను వీడియో తీశారు. ఇప్పటి వరకు ఏ మానవ మాత్రుడు చూడని అద్భుతమైన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. 90 డిగ్రీల కోణంలో భూ ధ్రువాలను వీడియో తీశారు. ది ఫ్రేమ్2 మిషన్ స్పేస్ క్రాఫ్ట్‌లో మొత్తం నలుగురు అంతరిక్షంలోకి వెళ్లారు. ఈ బృందానికి మాల్టీస్ అధినేత చున్ వాంగ్ నాయకత్వం వహించారు. ఆయనతో పాటు నార్వేకు చెందిన వెహికల్ కమాండర్ జెన్నిక్ మిక్కెల్ సన్, జర్మన్ పైలట్ రెబియా రోజీ, ఆస్ట్రేలియాకు చెందిన మెడికల్ ఆఫీసర్ ఎరిక్ ఫిలిప్స్ ఉన్నారు.


వీడియోలో ఏముంది..

ఎలన్ మస్క్ భూ ధ్రువాలకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యాహ్నం 12 గంటలకు వీడియో పోస్టు చేస్తే.. ఇప్పటి వరకు 12 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దాదాపు 5.20 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో తెల్లగా ఉన్న మంచు దిబ్బల దృశ్యాలు కన్నులకు విందు చేస్తున్నాయి. అంతపైనుంచి చూస్తుంటే.. మంచు కూడా ఆకాశంలా నీలిరంగులో కనిపిస్తోంది. అది అద్దం కారణంగా ఏర్పడ్డ రిఫ్లెక్షన్ కావచ్చు. ఏది ఏమైనప్పటికి ది ఫ్రేమ్2 మిషన్ స్పేస్ క్రాఫ్ట్‌ ద్వారా అంతరిక్షం నుంచి భూమిపై ఉన్న ధ్రువాలను వీడియో తీసిన ఆ నలుగురు చరిత్రలో నిలిచిపోతారు.


వినాశనానికి ఎక్కువ సమయం లేదు..

ది ఫ్రేమ్2 మిషన్ స్పేస్ క్రాఫ్ట్‌నుంచి తీసిన వీడియోను బాగా గమనిస్తే.. మంచుపై పెద్ద పెద్ద పగుళ్లను మనం గుర్తించవచ్చు. మంచు కొన్ని చోట్ల ఎత్తైన దిబ్బల్లా ఉంటే.. మరికొన్ని చోట్ల పల్చగా మారింది. బీటలు కూడా ఇచ్చింది. అంటే మంచు మెల్ల మెల్లగా కరిగిపోతోంది. ధ్రువాల్లోని చాలా భాగం ఇలా పెద్ద పెద్ద పగుళ్లతో ఉంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ధ్రువాల్లోని మంచు వేగంగా కరుగుతోందని, వినాశనం తప్పదని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ ఇంకా పెరిగితే మంచు మరింత త్వరగా కరుగుతుంది. తద్వారా భూభాగం తగ్గి నీటి భాగం పెరుగుతుంది. మంచు కరిగే వేగాన్ని బట్టి దేశాలే నీళ్ల పాలు అయ్యే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి:

Waqf Bill: వక్ఫ్ బిల్లు చారిత్రకం.. ఏక్‌నాథ్ షిండే శివసేన మద్దతు

Baba Vanga: బాబా వంగా చెప్పినట్టే జరిగింది.. 2025లో నిజమైన ఆ సంఘటన..

Updated Date - Apr 02 , 2025 | 05:34 PM