కుటీర పరిశ్రమలతో ఆదాయం పెంచుకోవాలి

ABN , First Publish Date - 2021-04-20T05:34:34+05:30 IST

కుటీర పరిశ్రమలతో ఆదాయం పెంచుకోవాలి

కుటీర పరిశ్రమలతో ఆదాయం పెంచుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న సంపత్‌రావు

నల్లబెల్లి, ఏప్రిల్‌ 19: కుటీర పరిశ్రమల ద్వారానే మహిళలకు ఆదాయ వనరులు సమకూరుతాయని డీఆర్‌డీవో పీడీ సంపత్‌రావు, జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ పెద్ది స్వప్న అన్నారు. సోమవారం  స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మండల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ సమాజంలో మహిళలు ఉన్నత స్థితికి చేరుకోవాలంటే ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలన్నారు. కుటీర పరిశ్రమలు నెలకొల్పుకుంటే మహిళ పొదుపు సంఘాలకు ప్రభుత్వం రుణ సదుపాయంతోపాటు అన్ని రకాల సహకారాలను అందిస్తుందన్నారు. చేనేత వస్త్రాల తయారు నుంచి గృహోపకరణాలు, పచ్చళ్లు, పిండి వంటలు, కుట్టు మిషన్లు, పేపర్‌ప్లేట్స్‌ తదితర కుటిర పరిశ్రమలు నెలకోల్పుకుంటే ఆదాయం పెరుగుతుందని చెప్పారు. సమావేశంలో ఎంపీపీ ఊడ్గుల సునీత, మహిళ సమాఖ్య అధ్యక్షురాలు పెద్ది మమత, ఏపీఎం సునీత తదితరులు పాల్గోన్నారు.

Updated Date - 2021-04-20T05:34:34+05:30 IST