చాకరిమెట్ల ఆలయహుండీ లెక్కింపు
ABN , First Publish Date - 2021-04-28T06:52:12+05:30 IST
శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల అటవీ ప్రాంతంలో వెలసిన చాకరిమెట్ల ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపును మంగళవారం నిర్వహించారు.

శివ్వంపేట, ఏప్రిల్ 27: శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల అటవీ ప్రాంతంలో వెలసిన చాకరిమెట్ల ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపును మంగళవారం నిర్వహించారు. ఈ నెల 21 నుంచి హుండీలో వచ్చిన ఆదాయాన్ని మంగళవారం దేవాదాయశాఖ పరిశీలకుడు శ్రీనివాస్ సమక్షంలో లెక్కింపు జరిగింది. మొత్తం రూ. 5,95,092 ఆదాయం హుండీద్వారా సమకూరినట్టు ఈవో తెలిపారు.