అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల సేవలు భేష్ : పెద్ది
ABN , First Publish Date - 2021-01-23T04:58:58+05:30 IST
అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల సేవలు భేష్ : పెద్ది

వరంగల్ రూరల్, జనవరి 22 : అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు చేసిన సేవలు భేష్ అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సంపేట క్యాంప్ కార్యాలయంలో ఐసీడీఎస్ పీడీ చెన్నయ్యతో కలిపి అంగన్‌వాడీలకు దుస్తులు(యూనిఫామ్), శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ అంగన్‌వాడీలు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి, సీడీపీవో రాధిక, ఏసీసీడీపీవో విద్య, అంగన్‌వాడీ యూనియన్ అధ్యక్షురాలు భారతి, టీఆర్‌ఎ్‌సకేవీ జిల్లా అధ్యక్షుడు యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.
పర్వతగిరి: అన్నారంషరీఫ్ యాకూబ్‌షావళి ద ర్గాలో శుక్రవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఆయన సతీమణి జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న పూజలు నిర్వహించారు. దర్గా ఇన్‌స్పెక్టర్ రియాజ్, సూపరింటెండెంట్ అజాద్‌లు వారికి దర్గా చిత్రపటాన్ని బహూకరించారు. కార్యక్రమంలో మండల కోఆప్షన్ మెంబర్ షబ్బీర్, మాజీ జడ్పీటీసీ లూనావత్ పంతులు, సర్పంచ్ మునుకుంట్ల యశోదబాబు, ఉపసర్పంచ్ మదన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.