టీడీపీకి మంచి రోజులొస్తున్నాయి
ABN , First Publish Date - 2022-12-22T23:27:45+05:30 IST
టీడీపీఇ పూర్వవైభవం రాబోతుందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాధనాయుడు పేర్కొన్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు వైసీపీ పాలనను ఎండగట్టేందుకు ‘ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.

కస్తూరి విశ్వనాథనాయుడు
ఓబులవారిపల్లె, డిసెంబరు 22: టీడీపీఇ పూర్వవైభవం రాబోతుందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాధనాయుడు పేర్కొన్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు వైసీపీ పాలనను ఎండగట్టేందుకు ‘ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నలుమూలల నుంచి ప్రతిరోజూ ఎంచుకున్న గ్రామాల్లో ఇంటింటా తిరిగి అధికార పార్టీ తీరును ఎండగడుతున్నారు. మండలంలోని పెద్దఓరంపాడు పంచాయతీ పాపిరెడ్డిపల్లె, గోవిందంపల్లె గ్రామాలలో నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటేశ్వరరాజు, మాజీ జడ్పీటీసీ రమణ, మండల టీడీపీ నాయకులు రమే్‌షబాబు, రమణారెడ్డి, ఈడిగపల్లె శివయ్యనాయుడు, నాగేంద్ర నాయుడు, అడ్వకేట్ పత్తూరి చంద్ర, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.
రాయచోటిటౌన్‌లో: రాష్ట్రంలో అభివృద్ధికి నడకలు నేర్పించింది టీడీపీ అధినేత చంద్రబాబునాయుడేనని, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచిరాష్ట్ర పరిస్థితి అధ్వానంగా తయారైందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఖాదర్‌బాషా ఆరోపించారు. గురువారం పట్టణంలోని 27వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో ‘ఇదేమి ఖర్మ మన రాష్ర్టానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ర్టాన్ని సర్వనాశనం చేయడం కోసమే జగన్ వైసీపీని స్థాపించినట్లు ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాజంపేట పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి అత్తర్‌జావేద్, రాజంపేట పార్లమెంట్ బీసీ కార్యదర్శి రామచంద్ర, నియోజకవర్గ తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు.
వీరబల్లిలో: కార్పొరేట్ సంస్థకు వత్తాసు పలకడం తగదని మండల టీడీపీ అధ్యక్షుడు భానుగోపాల్‌రాజు పేర్కొన్నారు. స్థానికంగా గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంపుడ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు వలన వందలాది ఎకరాల భూములను కోల్పోవడంతో పాటు వేలాది ఎకరాల భూములకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారడంతో రైతుల్లో ఆందోళన నెలకొందన్నారు. ఈ ప్రాంత రైతులకు అన్యాయం జరిగితే టీడీపీ తరపున ఎంత వరకైనా పోరాడేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, పార్లమెంట్ తెలుగుయువత కార్యదర్శి రమే్‌షబాబు, ఎస్సీ, బీసీ నాయకులు పాల్గొన్నారు.
సిద్దవటంలో: మండల పరిధిలోని మాధవరం 1, 2, 3 వార్డులో ‘ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి అన్ని వర్గాల ప్రజలను కలిసి వైసీపీ అరాచక పాలనను వివరించారు. కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నాగమునిరెడ్డి, ఫాస్టర్ ఇన్‌చార్జి దశరథరామ నాయుడు, రామచంద్రయ్య, డాక్టర్ వీరభద్రుడు, జింకా శివ, శ్రీనివాసులు, శ్రీను పాల్గొన్నారు.
సంబేపల్లెలో: అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్ర్‌సగా వైసీపీ పాలన కొనసాగుతోందని మండల టీడీపీ అధ్యక్షుడు చిన్నరెడ్డెయ్యయాదవ్, మాజీ సర్పంచ్ శశిదర్‌రెడ్డిలు తెలిపారు. టీడీపీ ఆదేశాల మేరకు గురువారం మండలంలోని పీఎన్‌కాలనీ గ్రామంలో ‘ఇదేమి ఖర్మ మన రాష్ర్టానికి’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నేత తోల వెంకట్రమణ, కార్యనిర్వాహక కార్యదర్శి సుబ్బరాజుయాదవ్, మాజీ వాటర్ షెడ్ ప్రెసిడెంట్ భాస్కర్, వెంకటయ్య, సుబ్బారెడ్డి, హరి, నాగరాజు, వెంకటాద్రి, అనిల్, అరుణ, ఉమాదేవి, కార్యకర్తలు పాల్గొన్నారు.