లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు
ABN , First Publish Date - 2022-12-24T00:11:05+05:30 IST
అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో ధనుర్మాసం 8వ రోజు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు.

పాలకొల్లు అర్బన్, డిసెంబరు 23: అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో ధనుర్మాసం 8వ రోజు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. వేకువజాము నుంచి ఆలయ ప్రధాన అర్చకులు స్వామి వారికి, అమ్మవారికి తిరుమంజన సేవలు నిర్వహించారు.
కనక దుర్గమ్మకు కుంకుమ పూజలు
యడ్ల బజారులోని కనక దుర్గమ్మకు శుక్రవారం మహిళలు ప్రత్యేక కుంకుమ పూజలు చేశారు. కొందరు భక్తులు 108 ప్రదక్షిణ చేశారు. భక్తుల ఆర్థిక సహకారం తో 500 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో ఎన్.సతీష్ కుమార్, పాలక మండలి చైర్మన్ కావలి శ్రీనివాసరావు, ట్రస్టీలు, సిబ్బంది పాల్గొన్నారు.