Ambedkar statue: అన్నామలైపురంలో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ

ABN , First Publish Date - 2022-10-28T11:28:54+05:30 IST

స్థానిక రాజా అన్నామలైపురంలో భారత రాజ్యాంగ నిర్మాణశిల్పి బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ గురువారం ఆవిష్కరించారు. అన్నామలైపురంలోని అంబేడ్కర్‌ మణిమండపం

Ambedkar statue: అన్నామలైపురంలో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ

ప్యారీస్‌(చెన్నై), అక్టోబరు 27: స్థానిక రాజా అన్నామలైపురంలో భారత రాజ్యాంగ నిర్మాణశిల్పి బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ గురువారం ఆవిష్కరించారు. అన్నామలైపురంలోని అంబేడ్కర్‌ మణిమండపం ప్రాంగణంలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని(Ambedkar statue) ఏర్పాటుచేయాల్సిందిగా దళిత్‌ పాంథర్స్‌ అఫ్‌ ఇండియా (డీపీఐ) వ్యవస్థాపకుడు, పార్లమెంటు సభ్యుడు తిరుమావళవన్‌ ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin)ను గతంలో అభ్యర్థించిన విషయం తెలిసిందే. అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏప్రిల్‌ 14న ఆయన రాష్ట్రప్రభుత్వానికి అప్పగించారు. ఆ విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్టించాలన్న దానిపై పరిశీలించిన ప్రభుత్వం, రాజాఅన్నామలైపురంలో ఉన్న అంబేడ్కర్‌ మణిమండపాన్ని ఎంపిక చేసింది. ఆ మేరకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ గురువారం ఉదయం అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దురైమురుగన్‌, కేఎన్‌ నెహ్రూ, పొన్ముడి, ఏవీ వేలు, ఎం.సుబ్రమణ్యం, సీవీ గణేశన్‌, మనో తంగరాజ్‌, కయల్‌విళి సెల్వరాజ్‌, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌ ప్రియ, ఎంపీలు తిరుమావళవన్‌, అందియూర్‌ సెల్వరాజ్‌, తిరురాజన్‌, తమిళిచ్చి తంగపాండ్యన్‌, ఎమ్మెల్యేలు తాయగం కవి, చిందనై సెల్వన్‌, వేలు, ఎం.బాబు, సెల్వపెరుందగై, రాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్‌ జయశీలన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-28T11:28:59+05:30 IST