NIA raids: కేరళలో పీఎఫ్ఐ నేతల ఇళ్లపై ఎన్ఐఏ దాడులు
ABN , First Publish Date - 2022-12-29T08:10:16+05:30 IST
కేరళ రాష్ట్రంలో గురువారం ఉదయం నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ దాడులు...
తిరువనంతపురం(కేరళ): కేరళ రాష్ట్రంలో గురువారం ఉదయం నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ దాడులు చేస్తోంది.(NIA raids) నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)కి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులను లక్ష్యంగా(linked to banned PFI leaders) చేసుకుని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) గురువారం తెల్లవారుజామున కేరళ రాష్ట్ర(Kerala) వ్యాప్తంగా 28 చోట్ల భారీ సోదాలు ప్రారంభించింది. పీఎఫ్‌ఐ నాయకులు వేరొక పేరుతో తిరిగి కార్యకలాపాలు సాగించాలని భావిస్తున్న నేపథ్యంలో ఎన్ఐఏ దాడి జరిగిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎర్నాకులంలో నిషేధితత పీఎఫ్ఐ నేతలతో సంబంధాలున్న 8మంది, తిరువనంతపురంలోని మరో ఆరుగురి ఇళ్లపై గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు.2006వ సంవత్సరంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, 2009లో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాలను ప్రారంభించారు.పీఎఫ్ఐపై కేంద్రం సెప్టెంబరు నెలలో నిషేధం విధించింది.