Vijay Divas: ఘనంగా ‘విజయ్ దివస్’
ABN , First Publish Date - 2022-12-17T08:23:41+05:30 IST
చెన్నై నగరంలో దక్షిణ భారత సైనిక విభాగం ‘విజయ్ దివస్’(Vijay Divas) నిర్వహించింది. భారత సైన్యం ప్రాణాలకు తెగించి

- అమరవీరులకు ఘననివాళి
ప్యారీస్(చెన్నై), డిసెంబరు 16: చెన్నై నగరంలో దక్షిణ భారత సైనిక విభాగం ‘విజయ్ దివస్’(Vijay Divas) నిర్వహించింది. భారత సైన్యం ప్రాణాలకు తెగించి 1971లో పాకిస్తాన్‌పై యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా డిసెంబరు 16న విజయ్ దివస్ జరుపుకోవడం ఆనవాయితి. త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు, అధికారుల సమక్షంలో అమరజవాన్ల స్మారకస్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించడం ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో, మెరీనా బీచ్ సమీపంలోని వార్ మెమోరియల్‌లో సైనిక విభాగం సాధించిన విజయానికి కారుకులై యుద్ధంలో అమరవీరులైన జవాన్లకు సైనికాధికారులతో కలసి లెఫ్ట్‌నెంట్ జనరల్ అరుణ్ నివాళులర్పించారు.