Viral News: ఫిపా వరల్డ్ కప్.. కేక్‌తో సెల్పీ కోసం బేకరీ ముందు బారులు తీరుతున్న జనం!
ABN , First Publish Date - 2022-11-26T10:29:38+05:30 IST
ఓ బేకరీ ముందు పెట్టిన కేకు.. రోడ్డుపై వెళ్లే ప్రయాణికులను విపరీతంగా ఆకర్షిస్తోంది. దీంతో ప్రయాణికులు తమ వాహనాలను అక్కడ నిలిపేసి మరీ.. ఆ కేక్‌తో సెల్ఫీ తీసుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం..
ఇంటర్నెట్ డెస్క్: ఓ బేకరీ ముందు పెట్టిన కేకు.. రోడ్డుపై వెళ్లే ప్రయాణికులను విపరీతంగా ఆకర్షిస్తోంది. దీంతో ప్రయాణికులు తమ వాహనాలను అక్కడ నిలిపేసి మరీ.. ఆ కేక్‌తో సెల్ఫీ తీసుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కాగా.. ప్రయాణికులు ఆ కేక్‌తో సెల్ఫీ తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఇంతకూ ఆ కేక్‌కు ఉన్న ప్రత్యేకత ఏంటి? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
ఫుట్‌బాల్ క్రీడాకారులను టీవీలకు అతుక్కుపేయేలా చేస్తూ.. FIFA World Cup టోర్నమెంట్ ఈ నెల 20న మొదలైపోయింది. ఈ క్రమంలోనే తమిళనాడులోని రామాంతపురం ప్రాంతానికి చెందిన ఓ బేకరీ యజమాని వినూత్నంగా ఆలోచించాడు. వరల్డ్ కప్‌ను ప్రతిబింబించేలా నాలుగు మీటర్ల పొడవైన కేక్‌ను రెడీ చేయించాడు. అనంతరం దాన్ని ఓ గాజు బాక్సులో పెట్టి.. బేకరీ ముందు ప్రదర్శనకు ఉంచాడు. దీంతో అటువైపు వెళ్తున్న ప్రాయాణికులు.. తమ వాహనాలను పక్కన నిలిపి వేసి మరీ.. ఆ కేక్‌తో సెల్ఫీ తీసుకుంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
దీనికి కారణం ఇదే..
సదరు బేకరీ యజమాని వెంకట సుబ్బు దీనిపై స్పందించారు. ఈ 85కేజీల కేక్‌ను తయారు చేయడానికి 65 కేజీల చెక్కెర, 240 గుడ్లను ఉపయోగించినట్టు చెప్పారు. నాలుగు రోజులపాటు శ్రమించి ఈ కేక్‌ను రూపొందించినట్టు పేర్కొన్నాడు. క్రీడలవైపు యువతను ఉత్తేజపరిచేందుకే.. ఇలా ఈ కేక్‌ను తయారు చేయించినట్టు వివరించాడు.