Viral Video: పిల్లలు ఫోన్‌కు ఎడిక్ట్ అవుతోంటే జాగ్రత్త.. ఈ బాలుడికి ఏమైందో చూస్తే షాక్ అవుతారు..
ABN , Publish Date - Mar 29 , 2025 | 10:02 AM
ఓ పిల్లాడు కుర్చీలో కూర్చుని ఫోన్‌లో గేమ్స్ ఆడుతుంటాడు. పక్కన ఎవరున్నారనే విషయం కూడా మర్చిపోయి పూర్తిగా ఫోన్‌లో లీనమై ఉంటాడు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చి వాలుతోంది. అలాగే మరోవైపు మనిషి ప్రపంచం మొత్తం ఫోనే అవుతోంది. ఫోన్ పట్టుకున్న వ్యక్తి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మర్చిపోయే పరిస్థితి. కొందరైతే అన్ని పనులూ పక్కన పెట్టి ఫోన్ చూడడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఇక పిల్లలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ చివరకు అనేక మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పిల్లలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఓ పిల్లాడి వీడియో చూసి అంతా షాక్ అవుతున్నారు. ఫోన్ చూస్తున్న పిల్లాడికి సడన్‌గా ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లాడు కుర్చీలో కూర్చుని ఫోన్‌లో గేమ్స్ ఆడుతుంటాడు. పక్కన ఎవరున్నారనే విషయం కూడా మర్చిపోయి పూర్తిగా ఫోన్‌లో లీనమై ఉంటాడు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. అప్పటిదాకా ఫోన్ చూస్తున్న వ్యక్తి.. సడన్‌గా పిట్స్ వచ్చిన వాడిలా (child fell down while looking at phone) గట్టిగా అరుస్తూ బిగుసుకరుపోతాడు.
Viral Video: బ్రష్‌తో బైక్‌నే నడిపించాడుగా.. ఇతడి టెక్నిక్ చూస్తే కళ్లు తేలేస్తారు..
పిల్లాడు కింద పడడంతో పక్కన ఉన్న పిల్లలంతా షాక్ అవుతారు. అక్కడే ఉన్న పిల్లాడి తల్లి పరుగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటుంది. ఇంతటితో ఈ వీడియో ముగుస్తుంది. ఫోన్‌కు అడిక్ట్ అయిన పిల్లలు.. అనేక సమస్యలతో ఇబ్బది పడడం తరచూ చూస్తుంటాం. కొందరు పిల్లలు నిద్రలో పిచ్చి పిచ్చిగా అరవడం, మరికొందరు పిల్లలు నిద్రలేమి సమస్యతో పాటూ ఏకాగ్రత, చురుకుదనం,జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలతో ఇబ్బంది పడడం కూడా చూస్తున్నాం. పిల్లలకు ఫోన్ దూరంగా ఉంచాలని వైద్యులు కూడా పదే పదే హెచ్చరిస్తున్నారు.
Python Viral Video: ఈత కొడుతున్న పిల్లలు.. కాళ్లకు తగిలిన కొండచిలువ.. చివరకు జరిగింది చూస్తే..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. ఇదేంటీ ఇలా జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘పిల్లకు ఫోన్ దూరంగా ఉంచమనేది ఇందుకే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14 వేలకు పైగా లైక్‌లు, 2.3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
ఇవి కూడా చదవండి..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..