India forex reserves: పుష్కలంగా భారత ఆర్థిక నిల్వలు
ABN , Publish Date - Mar 29 , 2025 | 06:29 PM
ప్రపంచ దేశాల ఆర్థిక నిల్వలు తగ్గుతుంటే, భారత ఆర్థిక నిల్వలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య భారత్ బలంగానే కనిపిస్తోంది. వరుసగా మూడో వారం కూడా ఇండియా ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) రిజర్వ్స్ పెరిగాయి.

వరుసగా మూడో వారం ఇండియా ఫారిన్ ఎక్స్ఛేంజ్ (India forex reserves) రిజర్వ్స్ పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతి శుక్రవారం రిలీజ్ చేసే రిపోర్ట్ లో భాగంగా తాజా డేటా ప్రకారం, 2025 మార్చి 21తో ముగిసిన వారానికి నిల్వలు $4.529 బిలియన్లు పెరిగి, $658.8 బిలియన్లకు (రూ.560,530,000 కోట్లు) చేరుకున్నాయి. అంతకు ముందు వారం $305 మిలియన్ల స్వల్ప పెరుగుదల నమోదైందన సంగతి తెలిసిందే. అప్పుడు నిల్వలు $654.271 బిలియన్లుగా ఉన్నాయి.
భారత స్టాక్ మార్కెట్లు దాదాపు రెండు వారాలుగా పెరుగుతూ ఉండటం కరెన్సీ విలువల్లో మార్పులకు కారణమైంది. ఫారెక్స్ మార్కెట్లో భారత రూపాయిని స్థిరీకరించడానికి ఆర్‌బీఐ చేసిన ప్రయత్నాల కారణంగా కూడా ఈ స్థిరమైన పెరుగుదల వచ్చింది. నిల్వలు 2024 సెప్టెంబర్‌లో ఆల్ టైమ్ గరిష్ట స్థాయి $704.885 బిలియన్లకు చేరుకున్నాయి. కానీ అప్పటి నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ పెరుగుదల నమోదు కావడం శుభసూచికం.
ఈ వార్తలు కూడా చదవండి
AP News: కొలిక్కి రాని కొలికపూడి ఇష్యూ.. తిరువూరులో ఉత్కంఠ..
Good News To Youth: ఉద్యోగాల పండగ.. టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో సీఎం గుడ్‌న్యూస్
CM Chandrababu: ప్రజా సేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్నా...
For More AP News and Telugu News