Viral Video: రోడ్డు పక్కన సిమెంట్ బ్యాగు నుంచి వింత శబ్ధాలు.. ఏముందా అని తెరచి చూడగా.. దిమ్మతిరిగే సీన్..
ABN , Publish Date - Mar 29 , 2025 | 11:15 AM
రోడ్డు పక్కన సిమెంట్ బ్యాగు నుంచి శబ్ధాలు వస్తుండడంతో స్థానికులు భయపడ్డారు. దాని వద్దకు వెళ్లేందుకు అంతా భయపడ్డారు. కాసేపటి తర్వాత ఓ వ్యక్తి ధైర్యం చేసి బ్యాగు వద్దకు వెళ్లి పరిశీంచాడు. తెరచి చూడగా చివరకు షాకింగ్ సీన్ కనిపించింది..

మానవత్వం రోజురోజుకూ మంటగలిసిపోతోంది. దీనితోడు యువత చెడు వ్యసనాలకు బానిసలై నేరాలు చేయడం, ప్రేమ పేరుతో మోసాలు చేయడం సర్వసాధారణమైపోయింది. ఈ క్రమంలో తమ తప్పులు బయటపడకుండా ఉండేందుకు తప్పు మీద తప్పులు చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు నిత్యం అనేక సంఘటనలను చూస్తున్నాం. తాజాగా, ఇలాంటి షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోడ్డున పడి ఉన్న సిమెంట్ బ్యాగు నుంచి వింత శబ్ధాలు రావడం చూసి అంతా భయపడ్డారు. చివరకు ఏముందా అని తెరచి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది.
సోషల్ మీడియలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన సిమెంట్ బ్యాగు నుంచి శబ్ధాలు వస్తుండడంతో స్థానికులు భయపడ్డారు. దాని వద్దకు వెళ్లేందుకు అంతా భయపడ్డారు. కాసేపటి తర్వాత ఓ వ్యక్తి ధైర్యం చేసి బ్యాగు వద్దకు వెళ్లి పరిశీంచాడు. తెరచి చూడగా (Newborn baby in cement bag) చివరకు అందులో షాకింగ్ సీన్ కనిపించింది. నవజాత శిశువు ఏడుస్తూ ఉండడం చూసి అంతా ఆశ్చర్యానికి గురయ్యారు.
Viral Video: పిల్లలు ఫోన్‌కు ఎడిక్ట్ అవుతోంటే జాగ్రత్త.. ఈ బాలుడికి ఏమైందో చూస్తే షాక్ అవుతారు..
ఆడపిల్ల పుట్టడంతో ఎవరో శిశువును మూట కట్టి సిమెంట్ సంచిలో పడేసినట్లు తెలిసింది. నవజాత శిశువులను ఇలా విసిరేయడం ఇది కొత్తేమీ కాదు. గతంలో చాలా మంది శిశువును ఇలా రోడ్డు పక్కన చెత్త కుప్పలు, సూటుకేసుల్లో పడేయడం చూశాం. తాజాగా, ఇలా శిశువును చుట్టచుట్టి సంచిలో పడేయడం చూసి అంతా అయ్యో.. పాపం.. అంటూ బాధపడుతున్నారు. ఇలా శిశువును పడేయడానికి వారికి మనసెలా వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Python Viral Video: ఈత కొడుతున్న పిల్లలు.. కాళ్లకు తగిలిన కొండచిలువ.. చివరకు జరిగింది చూస్తే..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలా పిల్లలను చెత్తబుట్టల్లో విసిరేసే వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘దేవుడు పిల్లలు కావాల్సిన వారికి ఇవ్వడు.. ఇలా రోడ్లపై పడేసే వారికే ఇస్తాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లు, 11.8 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
ఇవి కూడా చదవండి..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..