DJ Funny Viral Video: డీజేని ఎక్కడ వాడాలో వీళ్లకు బాగా తెలుసనుకుంటా.. ఇది కదా పనితనం అంటే..
ABN , Publish Date - Mar 29 , 2025 | 11:56 AM
కొందరు ఎంత పెద్ద కష్టాన్ని అయినా ఇలా ఎంతో సులభంగా చేసేస్తుంటారు. ఇంకొందరైతే పాట లేనిదే పని చేయలేని పరిస్థితి ఉంటుంది. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలను నిత్యం అనేకం చూస్తుంటాం. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది..

‘‘ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపేమున్నది’’.. అని ఓ సినీ అన్నట్లు ఆడుతూ, పాడుతూ పని చేస్తుంటే అలసట అనేదే కనిపించదు. కొందరు ఎంత పెద్ద కష్టాన్ని అయినా ఇలా ఎంతో సులభంగా చేసేస్తుంటారు. ఇంకొందరైతే పాట లేనిదే పని చేయలేని పరిస్థితి ఉంటుంది. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలను నిత్యం అనేకం చూస్తుంటాం. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు కూలీలు డీజే పాటలు ఎంజాయ్ చేస్తూ పని చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా డేజీని ఎక్కడ వాడాలో అక్కడే వాడేశారుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా డీజే పాటలు (DJ songs) అంటేనే పెళ్లిళ్లు గుర్తుకొస్తాయి. డీజే మ్యూజిక్ యువకులు సంతోషంగా డాన్స్‌లు వేయడం చూస్తుంటాం. అయితే ఇదే డీజే పాటలకు అంతకంటే సంతోషంగా ఎందుకు పని చేయకూడదు.. అనే సందేహం కొందరికి కలిగినట్లుంది.
ఆలోచన వచ్చిందో తడవుగా వెంటనే పెద్ద పెద్ద స్పీకర్లు ఏర్పాటు చేసుకుని, డీజే సాంగ్ ప్లే చేశారు. ఆ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తూ (Laborers dancing to DJ music) ఎంతో కష్టమైన ఆ పనులను సైతం వారు ఆడుతూ పాడుతూ చేసేస్తున్నారు. సిమెంట్ కలిపే వారు ఒకవైపు, భవనంపై కాంక్రీటు వేసే వారు మరోవైపు డాన్సులు వేసుకుంటూ చేసేస్తున్నారు. ఇలా డీజే పాటలు వింటూ తమ కష్టాన్ని మరచిపోతున్న ఈ కూలీలను చూసి అంతా.. శభాష్.. అంటూ మెచ్చుకుంటున్నారు.
Viral Video: పిల్లలు ఫోన్‌కు ఎడిక్ట్ అవుతోంటే జాగ్రత్త.. ఈ బాలుడికి ఏమైందో చూస్తే షాక్ అవుతారు..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘డీజేని మ్యూజిక్‌ను ఎక్కడ వాడాలో అక్కడే వాడేశారు’’.. అంటూ మరికొందరు, ‘‘ఇష్టపడి పని చేయడం అంటే ఇదేనేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 లక్షలకు పైగా లైక్‌లు, 11.7 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
ఇవి కూడా చదవండి..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..