Suryakumar Yadav: భారత్‌ను ఆదుకున్న సూర్యకుమార్ యాదవ్.. సఫారీల ఎదుట ఓ మోస్తరు లక్ష్యం

ABN , First Publish Date - 2022-10-30T18:28:35+05:30 IST

సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత జట్టు (Team India) ఇన్నింగ్స్ ముగిసింది. సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav: భారత్‌ను ఆదుకున్న సూర్యకుమార్ యాదవ్.. సఫారీల ఎదుట ఓ మోస్తరు లక్ష్యం

పెర్త్: సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత జట్టు (Team India) ఇన్నింగ్స్ ముగిసింది. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఒంటరి పోరుతో 133 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. సహచరులందరూ వరుసపెట్టి పెవిలియన్‌కు క్యూ కడుతున్న వేళ క్రీజులో పాతుకుపోయిన సూర్యకుమార్ యాదవ్ సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ సెంచరీ (68) సాధించాడు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. లుంగి ఎంగిడి వేసిన ఐదో ఓవర్‌లో రోహిత్ శర్మ (15), కేఎల్ రాహుల్ (14) అవుటయ్యారు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (12), దీపక్ హుడా (0), హార్దిక్ పాండ్యా (2) కూడా ప్రభావం చూపలేకపోయారు. లుంగి ఎంగిడి, పార్నెల్ నిప్పులు చెరిగే బంతులను ఎదుర్కోలేక వచ్చిన వారు వచ్చినట్టే వెనక్కి వెళ్లారు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ జట్టుకు ఆపద్బాంధవుడిలా మారాడు. సహచరులు ఒక్కొక్కరే పెవిలియన్ చేరుతున్నా సూర్యకుమార్ మాత్రం నిబ్బరంగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. చివరికి పార్నెల్ వేసిన 19వ ఓవర్ ఐదో బంతికి అవుటై వెనుదిరిగాడు. మొత్తంగా 20 ఓవర్లు ఆడిన టీమిండియా 9 వికెట్ల నష్టానికి 133 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. లుంగి ఎంగిడికి 4, పార్నెల్‌కు మూడు వికెట్లు దక్కాయి.

Updated Date - 2022-10-30T18:33:57+05:30 IST