Borabanda Railway Station: రౌడీ మూకల వీరంగం..సోదరుడితో ఆటోలో వెళ్తుండగా..
ABN , First Publish Date - 2022-11-12T12:19:36+05:30 IST
బోరబండ రైల్వే స్టేషన్ పరిసరాలు అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డాగా మారాయి. గంజాయి బ్యాచ్,
రైలు దిగి బయటకు వచ్చిన బాలికకు వేధింపులు
రూ.5వేల నగదు, సెల్‌ఫోన్‌తో పరార్..
హైదరాబాద్/అమీర్‌పేట: బోరబండ రైల్వే స్టేషన్ పరిసరాలు అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డాగా మారాయి. గంజాయి బ్యాచ్, వీధిరౌడీలు, చిల్లర దొంగలు రాత్రివేళ రైలుదిగి ఒంటరిగా బయట నడుచుకుంటు వెళ్తున్న మహిళలు, బాలికలను వేధిస్తున్నారు. ఎదురుతిరిగితే కత్తులతో బెదిరిస్తూ న్నా రు. ఈ తతంగం నిత్యం జరుగుతున్నా పోలీస్ పెట్రోలింగ్ లేకపోవడంతో రాత్రివేళ రైల్వే స్టేషన్‌లో దిగాలంటేనే జంకుతున్నారు. గురువారం రాత్రి తలాబ్‌కట్ట మొహిన్‌బాగ్‌కు చెందిన 15 ఏళ్ల బాలిక యాకుత్‌పూరకు వెళ్లి తన స్నేహితురాళ్లను కలిసి, సాయంత్రం అక్కడ ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది.
తన ఇద్దరు స్నేహితులు సంజీవయ్య పార్క్ రైల్వే స్టేషన్‌లో దిగిపోగా, సదరు బాలిక రాత్రి 11 గంటలకు బోరబండ రైల్వే స్టేషన్‌లో దిగి, తన సోదరుడుకు ఫోన్ చేసి బయట నిల్చుంది. అప్పటికే స్టేషన్ ఆవరణలో ఉన్న గుర్తుతెలియని ఐదుగురు దుండగులు అమ్మాయిని చుట్టుముట్టి వేధించడం ప్రారంభించారు. కొద్ది సేపటికే బాలిక సోదరుడు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి బైకులపై బోరబండ రైర్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. తన సోదరిని వేధిస్తున్న వారితో కొద్దిసేపు వాదనకు దిగి, అక్కడి నుంచి సోదరిని ఆటోలో తీసుకుని బయలు దేరాడు. తన స్నేహితులు బైకులపై ఆటో వెనుకాల వస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న ఐదుగురు దుండగులు ఆటోను వెంబడించి బోరబండ బస్టా్‌పలో ఆపారు. బాలిక సోదరుడిపై చేయి చేసుకోవడంతో పాటు తమ వద్ద ఉన్న జాంబీయా(పదునైన)కత్తితో బెదిరించి రూ.5వేల నగదు, సెల్‌ఫోన్‌ను తీసుకుని పరారయ్యారు.
కొంత దూరం వెళ్లాక మరోసారి వికా్‌సపూరి కాలనీలో ఆటోను అడ్డగించి కత్తితో బెదిరించి, విషయం బయటకు చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తనపై జరిగిన దాడిని ఎస్‌ఆర్ నగర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, నిందితులను త్వరలోనే పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తామని ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపారు.