Krishna funeral: మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నేడు..

ABN , First Publish Date - 2022-11-16T11:50:10+05:30 IST

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు బుధవారం సాయంత్రం నిర్వహించనున్నారు.

Krishna funeral: మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నేడు..

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు బుధవారం సాయంత్రం నిర్వహించనున్నారు. ఇప్పటికే పద్మాలయ

The video is not available or it's processing - Please check back later.

స్టూడియోకి కృష్ణ భౌతికకాయాన్ని తరలించారు. అభిమానుల సందర్శనకు అనుమతిస్తున్నారు. భారీగా అభిమానులు తరలివస్తుండడంతో పద్మాలయ స్టూడియో వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత స్టూడియో నుంచి మహాప్రస్థానానికి అంతిమయాత్ర సాగనుంది. మూడు గంటలకు కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.

కాగా.. ఆదివారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన సూపర్ స్టార్ కృష్ణను కుటుంబసభ్యులు కాంటినెంట్ హాస్పిటల్‌కు తరలించారు. ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందజేశారు. మంగళవారం తెల్లవారుజామున కృష్ణ ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించడంతో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.

Updated Date - 2022-11-16T11:50:13+05:30 IST

News Hub