Hyderabad Explosion: హైదరాబాద్‌లో భారీ పేలుడు... ఏం జరిగిందంటే
ABN , Publish Date - Mar 24 , 2025 | 09:52 AM
Hyderabad Explosion: హైదరాబాద్‌లో ఒక్కసారగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్, మార్చి 24: ఎప్పటిలాగే ఆ కేఫ్ బేకర్స్‌లోకి వంట మనుషులు వచ్చి తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఉదయం వచ్చే కస్టమర్ల కోసం ఐటమ్స్‌ను చకచకా చేస్తున్నారు. అక్కడున్న వారు ఎంతో సరదాగా మాట్లాడుతూ పని చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే పలువురు గాయపడ్డారు కూడా. పెద్ద ఎత్తున శబ్ధం రావడంతో అందులో ఉన్న మిగిలిన వారు భయాందోళనకు గురై అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. ఇంతకీ కేఫ్ అండ్ బేకర్స్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
నగరంలో ఈరోజు ఉదయం ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ భారీ పేలుడు సంభవించింది. సత్యం థియేటర్ దగ్గర క్రిసెంట్ కేఫ్ అండ్ బేకర్స్‌లో సిలిండర్ భారీ శబ్ధంతో పేలింది. పేలుడు ధాటికి షాప్‌లోని సామాగ్రి ఎగిరి బయటపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాద సమయంలో కేఫ్‌లో కస్టమర్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. మెయిన్ రోడ్డుపైనే ఈ ఘటన జరగడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
ఇవి కూడా చదవండి...
Life Style: ఈ చిట్కాలతో భార్య, భర్తల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి
Attack On Bollywood Actress: షాప్ ఓపెనింగ్‌కు వచ్చిన బాలీవుడ్ నటికి ఊహించని షాక్
Read Latest Telangana News And Telugu News