Share News

Phone Tapping Case Supreme Court: శ్రవణ్‌ను అరెస్ట్ చేయొద్దు.. సుప్రీం ఆదేశం

ABN , Publish Date - Mar 24 , 2025 | 04:11 PM

Phone Tapping Case Supreme Court: తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. శ్రవణ్‌ను అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించింది ధర్మాసనం.

Phone Tapping Case Supreme Court: శ్రవణ్‌ను అరెస్ట్ చేయొద్దు.. సుప్రీం ఆదేశం
phone tapping case Supreme Court

న్యూఢిల్లీ, మార్చి 24: ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకు ఊరట లభించింది. విదేశాల నుంచి భారత్ వచ్చేందుకు ఆయనను అరెస్ట్ చేయకుండా సుప్రీం కోర్టు మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం నుంచి ఊరట లభించడంతో ఈవారం చివర్లో శ్రవణ్ రావు హైదరాబాద్ రానున్నారు. పోలీసుల విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈరోజు ఏమైనా అరెస్ట్ చేస్తారా అని ధర్మాసనం ప్రశ్నించగా.. లేదంటూ తెలంగాణ ప్రభుత్వం తరుపు న్యాయవాది సమాధానం ఇచ్చారు. 48 గంటల్లో శ్రవణ్ రావు ఇండియాకు వస్తారని సీనియర్ న్యాయవాది దామ శేషాద్రి నాయుడు కోర్టుకు తెలిపారు.


తెలంగాణ ఫోన్ ట్యాపింగ్‌పై ఈరోజు సుప్రీంలో విచారణకు వచ్చింది. శ్రవణ్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది. ఈ క్రమంలో శ్రవణ్‌కు సుప్రీంలో స్వల్ప ఊరట లభించింది. శ్రవణ్‌పై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. అలాగే పోలీసుల విచారణకు సహకరించాలని శ్రవణ్‌కు సుప్రీం ఆదేశించారు. కచ్చితంగా విచారణకు హాజరుకావాల్సిందే అని స్పష్టం చేసింది. విచారణ నిమిత్తం అమెరికా నుంచి భారత్‌కు వచ్చేందుకు శ్రవణ్‌ను అరెస్ట్ చేయకుండా సుప్రీం మధ్యంతర రక్షణ కల్పించింది.

Viral Video: అనుకోని సంఘటన.. ఈమె చేసిన పనికి హ్యాట్సాఫ్ అనాల్సిందే..


బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బ్యూరోకాట్‌లో హైకోర్టు న్యాయమూర్తుల అక్రమ ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో శ్రవణ్ రావు నిందితుడిగా ఉన్నారు. తెలంగాణ హైకోర్టులో ముందుస్తు బెయిల్‌ కోసం పిటిషన్ వేయగా.. అందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టును శ్రవణ్ రావు ఆశ్రయించారు. దీంతో జస్టిస్ బి.వి నాగరత్నతో కూడిన ధర్మాసనం ముందు పిటిషన్ విచారణకు వచ్చింది. శ్రవణ్ రావు తరపున సీనియర్ న్యాయవాది దామ శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. శ్రవణ్‌‌ను అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇక 48 గంటల్లోనూ శ్రవణ్ అమెరికా నుంచి భారత్‌కు చేరుకుంటారనే విషయాన్ని కూడా కోర్టుకు తెలియజేశారు సీనియర్ న్యాయవాది. అలాగే పోలీసులు ఏమైనా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారాని కోర్టు ప్రశ్నించగా.. అలాంటి ఏమీ లేదని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. ఈ క్రమంలో ఈవారంలో హైరదాబాద్‌కు రానున్న శ్రవణ్ రావుకు పోలీసులు నోటీసులు ఇస్తారా లేక.. విచారణకు పిలిపి అనేక విషయాలు తెలుసుకున్న తర్వాత అరెస్ట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి...

Loan Repayment Tips: ఇలా చేయకపోతే... అప్పుల్లో తలనొప్పులు ఖాయం

Check Meat Quality Tips: మీరు తీసుకుంటున్న చికెన్, మటన్ తాజాదేనా..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 24 , 2025 | 04:11 PM