పాండురంగ ఆశ్రమంలో నామ సప్తాహం

ABN , First Publish Date - 2022-12-27T23:28:38+05:30 IST

జగదేవ్‌పూర్‌, డిసెంబరు 27: ఆధ్మాతిక చింతనకు అలవాళంగా నిలిచిన మర్కుక్‌ మండలం భవానందాపూర్‌లోని శ్రీపాండురంగ ఆశ్రమంలో నామ సప్తాహం మంగళవారం ప్రారంభమైంది.

పాండురంగ ఆశ్రమంలో నామ సప్తాహం

వచ్చే జనవరి 1న ఆలయ వార్షికోత్సవం

వారంరోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు

జగదేవ్‌పూర్‌, డిసెంబరు 27: ఆధ్మాతిక చింతనకు అలవాళంగా నిలిచిన మర్కుక్‌ మండలం భవానందాపూర్‌లోని శ్రీపాండురంగ ఆశ్రమంలో నామ సప్తాహం మంగళవారం ప్రారంభమైంది. పచ్చని ప్రకృతి ఒడిలో, ప్రశాంత వాతావరణంలో నిర్మించిన పాండురంగ ఆశ్రమం 89వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నామ సప్తాహం నిర్వహిస్తున్నారు. మంగళవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు వారంరోజుల పాటు జరగనున్నాయి. శతకోటి హరేరామ నామ జపం ప్రతి పల్లె పల్లెకు విస్తరించనున్నది. ప్రతి ఏటా ఆశ్రమంలో వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. రెండో పాండరీ పురంగా పేరొందిన ఈ ఆశ్రమం హరేరామ నామ జపంతో మార్మోగనున్నది. ఆశ్రమంలో ప్రతిరోజు రుక్మిణీ పాండురంగస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ పండితులు తెలిపారు. ప్రతిరోజు ఆశ్రమానికి వచ్చే భక్తులకు అన్నదానం నిర్వహించనున్నారు. సిద్దిపేట జిల్లా నుంచే కాకుండా ఇతరజిల్లాల నుంచి భక్తులు అశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారి హరేరామ నామ యజ్ఞంలో పాల్గొని పునీతులవ్వాలన్నారు.

కార్యక్రమ వివరాలు

మంగళవారం వార్షికోత్సవాలు ప్రారంభం కాగా.. జనవరి 2 వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం రుక్మిణీ పాండురంగస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అఖండ హరేరామ నామ సప్తాహం, భక్త బృందంచే హరేరామ నామ సంకీర్తన, జనవరి 1న ఉదయం 21 మంది వేదపండితులచే పాండురంగస్వామికి శ్రీసూక్త, పురుష సూక్తములతో క్షీరాభిషేకం, లక్ష పుష్పార్చన, యతివర భవానందభారతిస్వామి పల్లకీసేవ, పాదుక పూజ, మంగళరతి, 2న స్వామివారికి లక్ష పుష్పార్చన పాదన, క్షీరాభిషేకం, కుంకుమార్చన, పాదుకపడు, మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2022-12-27T23:28:39+05:30 IST