30 రోజుల్లో నీట్ ఇలా ప్లాన్ చేయండి
ABN , Publish Date - Mar 31 , 2025 | 05:14 AM
నీట్ పరీక్షకు దాదాపుగా ముప్పై రోజుల వ్యవధి ఉంది. ఈ సమయంలో విద్యార్థులకు ప్రణాళికాబద్దమైన వ్యూహం అవసరం. మొత్తం 180 ప్రశ్నలతో నీట్ యూజీ ఉంటుంది. ఇందులో ఫిజిక్స్ 45, కెమిస్ట్రీ 45, బయాలజీ 90 ఉంటాయనే...

30 రోజుల్లో నీట్ ఇలా ప్లాన్ చేయండి
నీట్ పరీక్షకు దాదాపుగా ముప్పై రోజుల వ్యవధి ఉంది. ఈ సమయంలో విద్యార్థులకు ప్రణాళికాబద్దమైన వ్యూహం అవసరం. మొత్తం 180 ప్రశ్నలతో నీట్ యూజీ ఉంటుంది. ఇందులో ఫిజిక్స్ 45, కెమిస్ట్రీ 45, బయాలజీ 90 ఉంటాయనే విషయం తెలిసిందే. ఇందులో సరైన సమాధానానికి 4 నాలుగు మార్కులు లభిస్తాయి. తప్పుగా రాసిన సమాధానానికి ఒక మార్కు మైనస్ చేస్తారు. పరీక్షకు సంబంధించి ఇలా మీదైన సొంత వ్యూహం రూపొందించుకోండి.
30 రోజులకు సంబంధించిన షెడ్యూల్‌ను మొదట ప్రిపేర్ చేసుకోండి. మూడు గంటలు ఫిజిక్స్, మూడు గంటలు కెమిస్ట్రీ, మూడు గంటలు బయాలజీకి కేటాయించండి.
గత పరీక్షల ఆధారంగా అధ్యాయాల వెయిటేజీని విశ్లేషించండి. 2021 నుంచి 2024 వరకు పేపర్ల ట్రెండ్‌ను గమనించండి.
ఫిజిక్స్, కెమిస్ట్రీ సహా అన్ని సబ్జెక్టుల కాన్సెప్టులను ఎన్‌సీఆర్‌టీ పుస్తకాల ఆధారంగా నేర్చుకోండి. ప్రతీ చాప్టర్‌కు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.
ప్రతీ సబ్జెక్టులోనూ ఎక్కువ వెయిటేజీ ఉన్న చాప్టర్లపై దృష్టి పెట్టండి. అలాగే ప్రతీ విద్యార్థి కొన్ని చాప్టర్లను సులభం అని భావిస్తారు. వాటిపై కూడా తప్పనిసరి దృష్టి సారించాలి.
రోజూ ఫిజిక్స్ ఫార్ములాలు రివిజన్ చేయండి. దీనితోపాటు 2021 నుంచి 2024 సంవత్సరాల ప్రశ్నపత్రాలను సాఽధన చేయండి. రోజుకు ఒక గంట అయినా ఈ పనిచేయాలి.
ఫిజిక్స్ ప్రాబ్లమ్ సాధించే సమయంలో టైమ్ మేనేజ్‌మెంట్ పాటించండి. ఒక ప్రశ్నను ఒక నిమిషంలో పూర్తి చేసేలా ఉండాలి.
ఫిజిక్స్‌లో రోజుకు కనీసం 30-40 ప్రశ్నలు పూర్తి చేసేలా చూసుకోండి.
రోజులో మొదట ఫిజిక్స్ సబ్జెక్టు చదవడానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఫ్రెష్ మైండ్‌తో ఎక్కువగా అర్థం అవుతుంది.
కెమిస్ట్రీ విషయానికి వస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీపై పట్టు సాధించండి. మెకానిజమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఫ్లోచార్ట్స్ గుర్తుంచుకోండి.
కెమిస్ట్రీ ఫార్ములా రివిజన్‌తోపాటు 2019 నుంచి 2024 వరకు ప్రశ్న పత్రాలపై పట్టుసాధించాలి.
ఫిజికల్ కెమిస్ట్రీలలో బలమైన అంశాలపై దృష్టిసారించండి. ఉదాహరణకు ఇన్‌ఆర్గానిక్ కెమిస్ట్రీలో బలహీనంగా ఉంటే పీ-బ్లాక్ ఎలిమెంట్స్, కో ఆర్డినేట్ కాంపౌండ్స్‌పై ఎక్కువ సమయం కేటాయించండి.
బయాలజీ విషయానికి వస్తే ఎన్‌సీఆర్‌టీ పుస్తకాలు చదవండి. జన్యుశాస్త్రం, మానవ శరీర నిర్మాణ శాస్త్రం, బయోటెక్నాలజీ, పర్యావరణ శాస్త్రం మొదలైన వాటికి ఎక్కువ వెయిటేజీ ఉంటుంది.
మెటీరియల్ చదివే సమయంలో రాసుకున్న షార్ట్‌నోట్స్ రివిజన్ సమయంలో బాగా ఉపయోగపడుతుంది. తరుచూ ఎంట్రెన్స్‌లో వచ్చే చాప్టర్లు ఎక్కువగా రివిజన్ చేయడాలి.
ముఖ్యమైన డయాగ్రామ్ చదవండి. ప్రతీ డయాగ్రామ్ లేబుల్స్ క్షుణ్ణంగా పరిశీలించండి.
బయాలజీ స్కోరింగ్ సబ్జెక్టు. అందుకే డిటైల్డ్‌గా చదవడానికి ప్రయత్నించండి.
వీలయినన్ని మాక్ టెస్ట్‌లు రాయండి. దీంతో ఏయే చాప్టర్లపై పట్టు ఉందో అర్థం అవుతుంది. అలాగే టైమ్ మేనేజ్‌మెంట్ టెక్నిక్ తెలుస్తుంది.
నా ప్రిపరేషన్ సరిగా లేదేమో లేదా సరిపోలేదేమో అనే భావనకు లోనుకావద్దు. ఆత్మవిశ్వాంతో ఉండండి.
సొంతంగా చదువుకునే సమయంలో సందేహం వస్తే టెక్నాలజీపై ఆధారపడండి. అంతేతప్ప సందేహాన్ని తీర్చుకునే విషయంలో వాయిదా అనే మాటే వద్దు. యూట్యూబ్స్, సబ్జెక్ట్ వెబ్‌సైట్స్ ఉపయోగించుకోండి.
డా. కిషన్ రావు టంకశాల
సంజీవని మెడికల్ అకాడమి
ఇవి కూడా చదవండి:
ప్రభుత్వ స్కీంలో కోటి రూపాయలు సంపాదించడం ఎలా..నెలకు ఎంత సేవ్ చేయాలి..
గోల్డ్‌కు గట్టి పోటీ ఇస్తున్న వెండి..ఏడాదిలో ఎంత పెరిగిందో తెలుసా..