ప్రధాని తెలంగాణకు రావడాన్ని తప్పుపట్టడం లేదు: ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2022-11-10T17:31:49+05:30 IST
ప్రధాని తెలంగాణకు రావడాన్ని తాము తప్పుపట్టడం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 8 ఏళ్లలో తెలంగాణకు మోదీ (Modi) ఏం చేశారో చెప్పాలి? అని ప్రశ్నించారు.
హైదరాబాద్: ప్రధాని తెలంగాణకు రావడాన్ని తాము తప్పుపట్టడం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 8 ఏళ్లలో తెలంగాణకు మోదీ (Modi) ఏం చేశారో చెప్పాలి? అని ప్రశ్నించారు. విభజన చట్టంలోని హామీలను కూడా నెరవేర్చలేదని, రాష్ట్ర ప్రభుత్వానికి నిధులివ్వకుండా కేంద్రం కోత విధిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ (BJP)కి సంబంధం లేకుంటే.. సిట్ వద్దని హైకోర్టు (High Court)కు ఎందుకు వెళ్లారు? అని ప్రశ్నించారు. గవర్నర్ తమిళిసై రాజకీయాలు చేయడం సరికాదని దయాకర్‌రావు హితవుపలికారు.
ఈ నెల 12న ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు. 12న ఏపీలోని విశాఖపట్నంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని రామగుండానికి ప్రధాని చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రామగుండం ఎరువులు, రసాయనాల పరిశ్రమ (ఆర్‌ఎఫ్‌సీఎల్)ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4.15 గంటలకు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. రామగుండంలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌తో సహా మొత్తం రూ.9,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపనలు చేస్తారు. అయితే ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రానున్న ప్రధాని మోదీని అడ్డుకుంటామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) అధ్యక్షుడు వెంకటరావు తెలిపారు. సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. 10న సింగరేణి వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపి, 11న గోదావరిఖనిలో భారీ ప్ర దర్శన చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత మోదీకి లేదని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు.