Vijayashanti: వాష్‌రూం ఒకటి.. విద్యార్థినులు 400 మంది.. ఇదీ కేసీఆర్ పాలన

ABN , First Publish Date - 2022-12-20T20:00:14+05:30 IST

Hyderabad: హైదరాబాద్ సరూర్ నగర్‌లోని ప్రభుత్వ కాలేజీలో 400 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. వీరందరికి కలిపి ఒకే వాష్ రూం ఉంది. దీంతో విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులపై బీజేపీ (BJP) నాయకురాలు

Vijayashanti: వాష్‌రూం ఒకటి.. విద్యార్థినులు 400 మంది.. ఇదీ కేసీఆర్ పాలన

Hyderabad: హైదరాబాద్ సరూర్ నగర్‌లోని ప్రభుత్వ కాలేజీలో 400 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. వీరందరికి కలిపి ఒకే వాష్ రూం ఉంది. దీంతో విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులపై బీజేపీ (BJP) నాయకురాలు విజయశాంతి స్పందించారు. తన రాష్ట్రంలోని భావి భారత పౌరులకి న్యాయం చేయలేని సీఎం కేసీఆర్ (CM KCR) బీఆర్‌ఎస్‌ (BRS)తో ఏం ఉద్ధరిస్తారో చెప్పాల్సిన పని లేదని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

విజయశాంతి పోస్టు యథాతథంగా..

‘‘సిగ్గు సిగ్గు.... తెలంగాణ సర్కారు విద్యార్థులపై పగబట్టింది. సుమారు 400 మంది విద్యార్థినులున్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్‌లో ఉన్న గవర్నమెంట్ కాలేజీలో ఒకే ఒక్క వాష్ రూమ్ ఉండటంతో వారంతా నరకయాతన పడుతున్నరు. తమకు ఎదురవుతున్న వేదన భరించలేక కాలేజీలో ఉన్నప్పుడు వాష్ రూంకి వెళ్లే అవసరం రాకుండా పాపం నీరు తాగడం మానేస్తున్నరు. పీరియడ్స్ రాకుండా టాబ్లెట్స్ వాడుతున్నరు. ఈ పరిణామాలు వారి ఆరోగ్యంపై తీవ్రంగా చెడు ప్రభావం చూపుతాయి. భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య పరిస్థితులకు గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడి పరిస్థితులు మెరుగుపరచమని గత 2 రోజులుగా విద్యార్థినులు ఆందోళన చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగంలో చలనం లేదు. అధికారంలో ఉన్న తమ స్వంత రాష్ట్రంలోనే భావి పౌరులకి న్యాయం చెయ్యలేని సీఎం కేసీఆర్ గారు... బీఆరెస్‌తో ఏం ఉద్ధరిస్తారో చెప్పాల్సిన పని లేదు.’’ అని విజయశాంతి పేర్కొన్నారు.

Updated Date - 2022-12-20T20:00:32+05:30 IST