ఆదర్శంగా షాద్‌నగర్‌ అభివృద్ధి

ABN , First Publish Date - 2022-12-17T23:11:50+05:30 IST

షాద్‌నగర్‌ మున్సిపాలిటీని ఆదర్శంగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ తెలిపారు.

ఆదర్శంగా షాద్‌నగర్‌ అభివృద్ధి
సీసీ రోడ్డు పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌

షాద్‌నగర్‌ అర్బన్‌, డిసెంబరు 17: షాద్‌నగర్‌ మున్సిపాలిటీని ఆదర్శంగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ తెలిపారు. 1వ వార్డులో రూ.22లక్షలతో, 13వ వార్డులో రూ.3లక్షలతో సీసీరోడ్డు నిర్మాణ పనులు, 12వ వార్డులో రూ.6లక్షలతో అంతర్గత మురుగునీటి పైపులైన్‌ పనులను ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలోని ప్రతి కాలనీకి మిషన్‌ భగీరథ పైపులైన్లను పూర్తి చేశామని అన్నారు. ఇక మురుగునీటి కాలువల నిర్మాణం, సీసీరోడ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని అన్నారు. అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్‌ లైట్లను ఏర్పాటు చేస్తూ, పచ్చదనాన్ని పెంచుతూ, పారిశుధ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఈటె గణేష్‌, కమిషనర్‌ వెంకన్న, కౌన్సిలర్లు గౌస్‌ఖాన్‌, అంతయ్య, చంద్రకళ పాల్గొన్నారు.

సైన్స్‌ఫేర్‌తో విద్యార్థుల్లో మనో విజ్ఞానం

షాద్‌నగర్‌ అర్బన్‌: సైన్స్‌ఫేర్‌తో విద్యార్థుల్లో మనో విజ్ఞానం పెరుగుతందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్‌ పేర్కొన్నారు. షాద్‌నగర్‌ ఠాగూర్‌ ఉన్నత పాఠశాల నిర్వహించిన సైన్స్‌ఫేర్‌ను శనివారం ఎమ్మెల్యే పరిశీలించి, విద్యార్థుల విజ్ఞాన శక్తిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సైన్స్‌ఫేర్‌ను నిర్వహించడం వల్ల విద్యార్థులో ఆలోచన శక్తి పెరుగుతుందని, సాంకేతిక పరంగా ఎదుగుతారని అన్నారు. ప్రతి అంశంపై ఆలోచన శక్తి పెరిగి భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడే విజ్ఞాన వంతులుగా ఎదుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కర్సపాండెంట్‌ ఎన్‌కె రాజేంద్రప్రసాద్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఈటే గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పేదలకు అండగా బీఆర్‌ఎస్‌

కేశంపేట: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. కొత్తపేట గ్రామానికి చెందిన పెంటయ్య అనారోగ్యంతో నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని సర్పంచ్‌ నవీన్‌కుమార్‌, మండల కోఅప్షన్‌ సభ్యుడు జమాల్‌ఖాన్‌లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు రూ.4లక్షల ఎల్‌వోసీని మంజూరు చేయించి బాధిత కుటుంబానికి శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎంపీటీసీ మల్లేష్‌ యాదవ్‌, ఉపసర్పంచ్‌ నరే్‌షయాదవ్‌, కృష్ణయ్య, యాదయ్య గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

నందిగామ: మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. నర్సప్పగూడలోని అక్కమ్మ చెరువులో లక్షా 20 వేల చేపపిల్లలను ఆయన శనివారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వదిలారు. అదేవిధంగా నందిగామ మండలకేంద్రం నుంచి నర్సప్పగూడ వరకు బీటీరోడ్డు నిర్మాణానికి రూ.3కోట్ల 10 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నర్సప్పగూడ సర్పంచ్‌ గోవిందు అశోక్‌, ఇతర నాయకులు, గ్రామస్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ ఈటగణేష్‌, ఎంపీటీసీ కళమ్మ, పీఏసీఎస్‌ చైర్మన్‌ అశోక్‌, ఉపసర్పంచ్‌ శేఖర్‌, నాయకులు శివశంకర్‌గౌడ్‌, విఠల్‌, సుదర్శన్‌గౌడ్‌, జంగిలి కుమార్‌, రవి, సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-17T23:11:51+05:30 IST