తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన కవి కాళోజీ

ABN , First Publish Date - 2022-09-10T05:09:14+05:30 IST

తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన కవి కాళోజీ

తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన కవి కాళోజీ
మేడ్చల్‌ కలెక్టరేట్‌లో కాళోజీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న అధికారులు

మేడ్చల్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : తెలంగాణాలోని ప్రజలను ఎంతో జాగృతం చేసిన కవి కాళోజీ నారాయణరావు అని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌ అన్నారు. శుక్రవారం మేడ్చల్‌ కలెక్టరేట్‌లో కాళోజీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ప్రజలను తన రచనలు, సాహిత్యం, కవితల ద్వారా ఎంతో జాగృతం చేశారన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏఈ వెంకటేశ్వర్లు, జిల్లా యువజన క్రీడల అసిస్టెంట్‌ మేనేజర్‌ జానకీరామ్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-10T05:09:14+05:30 IST